Shani Vakri 2023 Effect: కర్మలను బట్టి ఫలాలను ఇచ్చే దేవుడు శని. అందుకే ఇతడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. 30 సంవత్సరాల తరువాత శనిదేవుడు తన సొంతరాశిలో సంచరిస్తున్నాడు. ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. నవంబరు 03 వరకు అదే స్థితిలో ఉంటాడు. శనిదేవుడి రివర్స్ కదలిక ప్రభావం మెుత్తం 12 రాశులవారిని ప్రభావితం చేస్తుంది. శని వ్యతిరేక కదలిక వల్ల మూడు రాశులవారు బంపర్ బెనిఫిట్స్ పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
తిరోగమన శని ఈ 3 రాశుల వారికి శుభప్రదం
వృషభం - శని తిరోగమనం మీకు కెరీర్ లో మంచి పురోగతిని ఇస్తుంది. మీరు కొత్త కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.
తుల రాశి- తిరోగమన శని తులారాశి వారికి ఆనందాన్ని ఇస్తుంది. మీరు ఉద్యోగ-వ్యాపారాలలో మంచి పురోగతిని సాధిస్తారు. మీరు ఈ సమయంలో కొత్త ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు లగ్జరీ లైప్ ను లీడ్ చేస్తారు. ధనం లాభదాయకంగా ఉంటుంది. మీరు డబ్బును ఆదా చేస్తారు. మీరు ఊహించని ప్రయోజనాలను పొందుతారు. పెట్టుబడుల ద్వారా లాభం ఉంటుంది.
Also Read: Budh Uday 2023: రేపు కర్కాటక రాశిలో ఉదయించబోతున్న బుధుడు.. ఈ 3 రాశులకు అదృష్టంతోపాటు ఐశ్వర్యం..
మకరం- శని రివర్స్ కదలిక మకర రాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. మీ కెరీర్లోని అడ్డంకులన్నీ దూరమవుతాయి. ఉద్యోగాలు చేస్తున్నవారికి ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా లభించవచ్చు. వ్యాపారులు లాభపడతారు. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook