Jupiter Transit Effect On Zodiac Sign:  జూలై నెలలో ఇప్పటికే కొన్ని ప్రధాన గ్రహాలు తమ రాశిని మార్చాయి. ఈ నెల చివరిలో మరో ముఖ్య గ్రహమైన గురుడు తన రాశిని మార్చబోతున్నాడు. జూలై 29న గురు గ్రహం మీనరాశిలోకి ప్రవేశించనుంది. ఆ రాశిలోనే గురుడు తిరోగమనం (Jupiter Transit in Pisces) చేయనున్నాడు. అక్కడే బృహస్పతి నవంబర్ 24, 2022 వరకు ఉంటుంది.  మీనంలో బృహస్పతి తిరోగమన ప్రభావం మెుత్తం 12 రాశుల ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తుంది. అయితే 3 రాశులకు వారికి గురు సంచారం ఇబ్బందులకు గురి చేస్తుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం (Aries) - ఆస్ట్రాలజీ ప్రకారం, రాహు గ్రహం ఇప్పటికే మీన రాశిలో కూర్చుని ఉంది. మీనరాశిలో గురు, రాహుల కలయిక అశుభంగా భావిస్తారు.  మీరు అనారోగ్యం బారినపడే అవకాశం ఉంది. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. 


మిథునం (Gemini) - బృహస్పతి సంచారం ఈ రాశి వారికి కష్టాలను తీసుకొస్తుంది. మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. మీరు ఎవరికైనా డబ్బును ఇచ్చినట్లయితే.. ఆ మనీ రాబట్టుకోవడంలో ఆటంకాలు ఎదురవుతాయి. 


మీనం (Pisces) - మీనంలో గురు సంచారం వల్ల మీ వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తవచ్చు. మీ పనులు ఆలస్యంగా జరుగుతాయి. జాతకంలో బృహస్పతి గ్రహాన్ని బలోపేతం చేయడానికి విష్ణువును పూజించడం మంచిది.


Also Read: Sravana Shivratri 2022: శ్రావణ శివరాత్రి వచ్చేస్తోంది... తేదీ, పూజ ముహూర్తం తెలుసుకోండి



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook