Sravana Shivratri 2022: శ్రావణ శివరాత్రి వచ్చేస్తోంది... తేదీ, పూజ ముహూర్తం తెలుసుకోండి

Sravana Shivratri 2022: శ్రావణ మాసంలోని కృష్ణ చతుర్దశినే శ్రావణ శివరాత్రి అంటారు. శ్రావణ శివరాత్రి పరమశివునికి చాలా ప్రీతికరమైనది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 16, 2022, 03:57 PM IST
  • జూలై 26న శ్రావణ శివరాత్రి
  • పూజ ముహూర్తం గురించి తెలుసుకోండి
Sravana Shivratri 2022: శ్రావణ శివరాత్రి వచ్చేస్తోంది... తేదీ, పూజ ముహూర్తం తెలుసుకోండి

Sravana Shivratri 2022: శ్రావణ మాసంలోని కృష్ణ చతుర్దశినే శ్రావణ శివరాత్రి అంటారు. శ్రావణ శివరాత్రి శివుడికి ఎంతో ప్రీతికరమైనది. శ్రావణ మాసం (Sravana Masam) ఇప్పటికే ప్రారంభమైంది. ఇది ఆగస్టు 12తో ముగుస్తుంది. ఈ మాసంలో శివారాధన ఎక్కువగా చేస్తారు. శివుడి ఆశీస్సులు పొందడానికి అనేక చర్యలు తీసుకుంటారు. 

ఈసారి శ్రావణ శివరాత్రిని (Sravana Shivratri 2022) జూలై 26 మంగళవారం జరుపుకోనున్నారు. శ్రావణ సోమవారంతో పాటు శ్రావణ శివరాత్రి రోజున ఉపవాసం ఉంటూ మహాదేవుడిని పూజిస్తారు భక్తులు. ఈ రోజున భోలేనాథ్‌ను ఆరాధించడం ద్వారా భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు అంతేకాకుండా వీరు శివుడి అనుగ్రహంతో అపారమైన సంపదను పొందుతారు. 

పూజ ముహూర్తం
పంచాంగం ప్రకారం, ఈసారి శ్రావణ శివరాత్రి నాడు శివుడిని ఆరాధించడానికి ఉత్తమ సమయం 42 నిమిషాలు మాత్రమే. కాబట్టి భక్తులు పూజా సమయానికి ముందే శివారాధనకు సిద్ధం కావాలి.
శ్రావణ కృష్ణ పక్ష చతుర్దశి తిథి ప్రారంభం : జూలై 26, 2022 సాయంత్రం 06:46 గంటలకు
శ్రావణ కృష్ణ చతుర్దశి తిథి ముగింపు : జూలై 27, 2022 రాత్రి 09:11 గంటలకు
నిశిత కాల పూజ సమయం: 12:07 AM నుండి 12:49 AM వరకు, జూలై 27
శ్రావణ శివరాత్రి పూజ వ్యవధి: 42 నిమిషాలు

Also Read: Sravana First Saturday: శ్రావణ తొలి శనివారం ఈ 5 రాశులవారికి ప్రత్యేకం! 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News