Jupiter Retrograde 2023: సెప్టెంబరులో బృహస్పతి తిరోగమనం.. ఈ 4 రాశులను వరించనున్న అదృష్టం..
Jupiter Retrograde 2023: వచ్చే నెలలో దేవగురు బృహస్పతి తిరోగమనం చేయబోతున్నాడు. దీని ప్రభావం మెుత్తం 12 రాశులవారి పై ఉంటుంది. గురుడు రివర్స్ కదలిక ఏయే రాశులవారికి అనుకూలంగా ఉంటుందో తెలుసుకుందాం.
Guru Vakri 2023 effect: ఆస్ట్రాలజీలో బృహస్పతిని శుభగ్రహంగా భావిస్తారు. ఇతడు సంవత్సరానికి ఒకసారి తన రాశిని మారుస్తాడు. బృహస్పతిని అదృష్టం, సంతానం మరియు ఆనందానికి కారకుడిగా భావిస్తారు. ప్రస్తుతం గురుడు మేషరాశిలో సంచరిస్తున్నాడు. వచ్చే ఏడాది మే 01వరకు అక్కడే ఉంటాడు. అయితే దేవగురు బృహస్పతి 2023 సెప్టెంబరు 04న తిరోగమనం చేయబోతున్నాడు. గురుడు రివర్స్ లో కదలడం వల్ల ఏయే రాశులవారికి మేలు జరగనుందో తెలుసుకుందాం.
సింహ రాశి: బృహస్పతి వ్యతిరేక కదలిక సింహ రాశి వారికి అదృష్టాన్నిస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీకు కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది.
మిథున రాశి: గురుడు రివర్స్ కదలిక మిథున రాశి వారికి మేలు చేస్తుంది. మీకు ప్రతి పనిలోనూ అదృష్టం కలిసి వస్తుంది. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు.
మేషరాశి: బృహస్పతి తిరోగమనం మేషరాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. వ్యాపారులు భారీగా లాభాలను పొందుతారు.
మీనం: గురుడు తిరోగమనం వల్ల మీన రాశి వారికి మంచి రోజులు మెుదలవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులు లాభపడతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ జీవితం ఆనందమయం అవుతుంది. ఆఫీసులో అనుకూల వాతావరణం ఉంటుంది.
Also Read: Rajyog 2023: 50 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 3 రాశులకు ఆకస్మిక ధనలాభం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook