Jupiter Rise 2023 effect: ఆస్ట్రాలజీలో బృహస్పతిని దేవగురు అని పిలుస్తారు. ఇతడిని శుభగ్రహంగా భావిస్తారు. గ్రహాలు కాలానుగుణంగా ఉదయించడం లేదా అస్తమించడం చేస్తాయి. ఏప్రిల్ 27న గురుడు మేషరాశిలో ఉదయించాడు. అదృష్టం, సంపద మరియు సంతానికి కారకుడిగా గురుడిని భావిస్తారు. బృహస్పతి గమనంలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. గురుడు రైజింగ్ వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి
ఇదే రాశిలో బృహస్పతి ఉదయించడం జరిగింది. దీని కారణంగా మీరు ఆర్థికంగా లాభపడతారు. మీ హెల్త్ బాగుంటుంది. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ తో ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది. విద్యార్థులు పరీక్షల్లో రాణిస్తారు. పార్టనర్ షిప్ తో చేసే పనుల్లో విజయం ఉంటుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. 


ధనుస్సు రాశి
దేవగురు బృహస్పతి ఈ రాశి యెుక్క ఐదో ఇంట్లో ఉదయించబోతున్నాడు. దీంతో ధనస్సు రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగనుంది. అంతేకాకుండా పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. కెరీర్ లో మంచి పురోగతి ఉంటుంది. అంతేకాకుండా మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. 


కర్కాటక రాశి
గురుడు ఉదయం వల్ల వచ్చే ఏడాది పాటు కర్కాటక రాశి వారు మంచి ఫలితాలు పొందుతారు. ఎందుకంటే బృహస్పతి మీ రాశిలోని పదవ ఇంట్లో ఉదయించబోతున్నాడు. దీంతో మీకు పనిలో అదృష్టం కలిసి వచ్చి దానిని విజయవంతంగా పూర్తిచేస్తారు. మీ బిజినెస్ విస్తరిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. ఉద్యోగులు జీతం పెరగడంతోపాటు పదోన్నతి కూడా లభించే అవకాశం ఉంది. 


Also Read: Shani Dev: శష్ మహాపురుష రాజయోగం ఈ 3 రాశుల వారికి ప్రత్యేకం.. ఇందులో మీరాశి ఉందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook