Guru Uday 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు కాలానుగుణంగా ఉదయించడం, అస్తమించడం చేస్తాయి. ఈ గ్రహాల గమనంలో మార్పు కొందరికి శుభప్రదంగానూ, మరికొందరికి అశుభకరంగానూ ఉంటుంది. దేవతల గురువైన బృహస్పతి ఏప్రిల్ నెలలో మీనంలో ఉదయించబోతున్నాడు. దీని కారణంగా అరుదైన కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్కాటక రాశిచక్రం
కర్కాటక రాశి వారికి కేంద్ర త్రికోణ రాజయోగం లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే బృహస్పతి మీ రాశి నుండి తొమ్మిదవ ఇంట్లో సంచరిస్తున్నాడు. దీంతో మీ యెుక్క ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. మీకు లక్ కలిసి వస్తుంది. మీరు పని లేదా వ్యాపార నిమిత్తం ప్రయాణించే అవకాశం ఉంది. విదేశాల్లో చదువుకోవాలనే కోరికలు నెరవేరుతాయి. 
మిథున రాశిచక్రం
కేంద్ర త్రికోణ రాజయోగం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే బృహస్పతి మీ రాశి నుండి పదవ ఇంట్లో ఉదయిస్తాడు. దీంతో నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ లేదా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులు పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. మీ జాతకంలో హన్స్ అనే రాజయోగం ఏర్పడుతుంది. దీంతో మీరు పాత పెట్టుబడుల నుండి ప్రయోజనం పొందుతారు. 
కుంభం
కేంద్ర త్రికోణ రాజయోగం కుంభ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో గురుడు బృహస్పతి రెండవ ఇంట్లో ఉదయిస్తాడు. దీంతో మీరు భారీ మెుత్తంలో డబ్బు పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ కెరీర్ మునుపి కంటే అద్భుతంగా ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.


Also Read: Sun Transit 2023: వచ్చే నెల 15 వరకు ఈ రాశులకు డబ్బే డబ్బు.. ఇందులో మీ రాశి కూడా ఉందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook