Sun Transit In Kumbh 2023: రెండు రోజుల కిందట కుంభరాశిలో సూర్యభగవానుడి సంచారం జరిగింది. దీనినే మనం కుంభ సంక్రాంతిగా పిలుచుకుంటున్నాం. సూర్యదేవుడు వచ్చే నెల 15వరకు అదే రాశిలో కూర్చుంటాడు. ఆస్ట్రాలజీలో సూర్యుడిని గ్రహాలు రాజు అని సంభోదిస్తారు. సూర్యుడి గమనంలో మార్పు మనందరి లైఫ్ పై ఖచ్చితమైన ప్రభావాన్ని చూపుతుంది. కుంభంలో సూర్యుడి గోచారం వల్ల ఏ రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
సూర్య సంచారం.. ఈ రాశులకు కలిసిరానున్న కాలం
మకర రాశిచక్రం
సూర్య గ్రహం యొక్క రాశి మార్పు మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే సూర్యభగవానుడు మీ సంచార జాతకంలో రెండవ ఇంట్లోకి ప్రవేశించాడు. దీంతో మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. వ్యాపారస్తులు రుణ విముక్తి నుండి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగపడుతుంది. మీ మాటలతో ఇతరులను ఆకట్టుకుంటారు. పాలిటిక్స్ లో ఉన్నవారికి పదవి లభించే అవకాశం ఉంది.
సింహ రాశి
సూర్యభగవానుడు మీ రాశి నుండి ఏడవ ఇంట్లో ఉన్నాడు. దీంతో మీ కెరీర్ మలుపు తిరిగే అవకాశం ఉంది. పార్టనర్ షిప్ తో చేసే వ్యాపారంలో లాభాలు ఉంటాయి. మీరు ఈ సమయంలో ఏదైనా లగ్జరీ ఐటమ్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ లవ్ లైవ్ అద్భుతంగా ఉంటుంది. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది.
వృషభ రాశి
సూర్యభగవానుని సంచారం వల్ల వృషభరాశివారికి లక్ కలిసి వస్తుంది. ఎందుకంటే సూర్యభగవానుడు మీ రాశి నుండి కర్మ స్థానంలో కదులుతున్నాడు. దీంతో మీరు ఏ పని చేపట్టినా దానిని విజయవంతంగా పూర్తిచేస్తారు. జాబ్ మారాలనుకునేవారికి ఇదే మంచి సమయం. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.
Also Read: Guru-Shukra yuti 2023: ఇవాళ మీనంలో గురు-శుక్రల కలయిక.. ఈ 3 రాశులకు తిరుగులేదు ఇక..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook