Guru Gochar in Aries: ఏప్రిల్ 22న ఏర్పడనున్న `గురు చండాల యోగం`.. ఆ 4 రాశులకు 6 నెలలు పీడించనున్న కష్టాలు!
Jupiter transit 2023: గ్రహాల రాశి పరివర్తనం, గోచారంతో చాలా సార్లు గ్రహాల యుతి ఏర్పడుతుంది. జ్యోతిష్యం ప్రకారం గ్రహాల యుతి అంటే ఒకే రాశిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాల కలయికకు అత్యంత ప్రాధాన్యత, మహత్యముంటాయి.
Jupiter transit 2023: ఏప్రిల్ నెలలో రాహువు, గురుడు కలిసి యుతి ఏర్పర్చనున్నాయి. ప్రస్తుతం మేష రాశిలో ఉన్న రాహువుతో ఏప్రిల్ 22వ తేదీన గురు గ్రహం కలవనుంది. ప్రస్తుతం మీన రాశిలో ఉన్న గురుడు మేషరాశిలో రాహువుతో కలవడాన్ని గురు చండాల యోగంగా పిలుస్తారు. ఈ ప్రభావంతో ఆ 4 రాశులకు అల్లకల్లోలమే మిగలనుంది.
జ్యోతిష్యం ప్రకారం ఏదైనా గ్రహం మరో రాశిలో ప్రవేశిస్తున్నప్పుడు అన్ని రాశులపై ఆ ప్రభావం శుభంగానో, అశుభంగానో ఉంటుంది. వేర్వేరు సమయాల్లో వేర్వేరు గ్రహాలు గోచారం చేస్తుంటాయి. చాలాసార్లు మరో గ్రహంతో యుతి ఏర్పరుస్తుంటుంది. హిందూ పంచాంగం ప్రకారం ఏప్రిల్ నెలలో రాహువు, గురుడు కలిసి యుతి ఏర్పర్చనున్నాయి. ప్రస్తుతం మేషరాశిలో రాహువు ఉపస్థితుడై ఉన్నాడు. ఏప్రిల్ 22 న గురు గ్రహం మీనం నుంచి మేషంలో రానున్నాడు. ఈ సందర్భంగా రాహువు, గురుడు కలిసి గురు చండాల యోగం ఏర్పర్చనున్నారు. ఈ యుతి ఏకంగా 6 నెలలుంటుంది.
జ్యోతిష్యం ప్రకారం రాహువుని అశుభానికి, గురుడిని శుభానికి ప్రతీకగా భావిస్తకారు. ఈ రెండు గ్రహాల కలవడం వల్ల పూర్తిగా అశుభం కానుంది. దీని ప్రభావం అన్ని రాశులపై నెగెటివ్‌గా ఉంటుంది. మనస్సులో నెగెటివ్ ఆలోచనలు కలుగుతాయి. మూడు రాశులపై గురు చండాల యోగం చెడు ప్రభావం చూపిస్తుంది. ఈ రాశులవారు అందుకే చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఆ వివరాలు మీ కోసం. ఏయే గ్రహాలపై గురు చండాల యోగం పీడించనుందో తెలుసుకుందాం..
మేష రాశి
ఈ రాశివారి లగ్నపాదంలో ఏప్రిల్ 22 తరువాత గురు చండాల యోగం ఏర్పడనుంది. అంటే ఏప్రిల్ 22 నుంచి అక్టోబర్ 30 వరకూ 6 నెలల వరకూ తీవ్ర కష్టాలు ఎదుర్కోవల్సి వస్తుంది. ఈ సమయంలో మీకు ఇబ్బందులు ఎదురౌతాయి. ఆర్ధికంగా సమస్యలుంటాయి. గౌరవ మర్యాదలు క్షీణిస్తాయి. ఆరోగ్యం పాడయ్యే పరిస్థితి ఉంటుంది.
మిధున రాశి
గురు చండాల యోగం కారణంగా చెడు వార్తలు వినే అవకాశాలుంటాయి. ఆర్ధిక వ్యవహారాల్లో సమస్యలు ఎదుర్కోవల్సివస్తుంది. పనిచేసేచోట అనుకూల పరిస్థితులుండవు. ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. డబ్బుల సమస్య వేధిస్తుంది.
ధనస్సు రాశి
గురు చండాల యోగం కారణంగా ధనస్సు రాశి జాతకులు చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు పెరిగిపోతాయి. ఫలితంగా మనస్సులో దుఖం కలుగుతుంది. కెరీర్ పరంగా సమస్యలు ఎదుర్కోవల్సివస్తుంది.
Also read: Sun Transit 2023: ప్రత్యర్ధి గ్రహాల కలయికతో మార్చ్ 15 ఉదయ 6 గంటల్నించి ఆ 4 రాశులపై ఊహించని ధనలాభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook