Sun Transit 2023: ప్రత్యర్ధి గ్రహాల కలయిక.. మార్చి 15 ఉదయం 6 నుండి మీన రాశిలో ప్రవేశించనున్న సూర్యుడు.. ఈ రాశులకు ఊహించని ధనలాభం

Sun Transit 2023: జ్యోతిష్యం ప్రకారం అనంత విశ్వంలోని ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో రాశి పరివర్తనం లేదా గోచారం ఉంటుంది. వివిధ గ్రహాల రాశి పరివర్తనం లేదా గోచారం ప్రభావం వివిధ రాశులపై వేర్వేరుగా ఉంటుంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 13, 2023, 01:53 PM IST
Sun Transit 2023: ప్రత్యర్ధి గ్రహాల కలయిక.. మార్చి 15 ఉదయం 6 నుండి మీన రాశిలో ప్రవేశించనున్న సూర్యుడు.. ఈ రాశులకు ఊహించని ధనలాభం

Sun Saturn Yuti and Sun Transit 2023 in pisces from March 15 Morning 6: ప్రతి నెలా నిర్ణీత సమయంలో సూర్యుడు రాశి పరివర్తనం చెందుతుంటాడు. మార్చ్ 15 వతేదీన సూర్యుడు మీన రాశిలో ప్రవేశించనున్నాడు. ఈ క్రమంలో కొన్ని రాశులకు పెద్దఎత్తన ఉపశమనం లభించవచ్చు. కొన్ని రాశుల అదృష్టం సూర్యుడిలాగే ప్రకాశించనుంది.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం రాశి పరివర్తనం కచ్చితంగా ఉంటుంది. ప్రతి నెలా కొన్ని గ్రహాల గోచారముంటుంది. దీని ప్రభావం కొన్ని రాశులపై స్పష్టంగా కన్పిస్తుంది. సూర్యుడు ప్రతి 30 రోజులకు గోచారం చేస్తుంటాడు. మార్చ్ 15వ తేదీన కుంభ రాశి నుంచి బయటికొచ్చి మీన రాశిలో ప్రవేశించనున్నాడు. సూర్యుడు మీనరాశిలో ప్రవేశించడం వల్ల కొన్ని రాశులకు ఊహించని శుభ ఫలాలు కలగనున్నాయి. ఈ సందర్భంగా కొంతమందికి పదోన్నతి, ధనలాభం ఉంటాయి. ఈ సమయంలో చాలామందిలో సంబంధాలు పటిష్టమౌతాయి. 

సూర్య గోచారం ఎప్పుడు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల రారాజు సూర్యుడు మార్చ్ 15వ తేదీ ఉదయం 6 గంటల 58 నిమిషాలకు కుంభ రాశి నుంచి వైదొలగి మీన రాశిలో ప్రవేశించనున్నాడు. ఈ రాశిలో ఏప్రిల్ 14 వరకూ ఉండి..ఆ తరువాత మేష రాశిలో ప్రవేశిస్తాడు.

వృశ్చిక రాశి

ఈ రాశి పంచమ పాదంలో సూర్యుడి గోచారం జరగనుంది. ఈ పాదాన్ని ప్రేమ, సంతానం, చదువుకు ప్రాతినిధ్యంగా భావిస్తారు. ఈ క్రమంలో ఉద్యోగంలో లాభాలు ఆర్జిస్తారు. జీతం పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్దమయ్యే విద్యార్ధులకు విజయం లభిస్తుంది.

మీన రాశి

సూర్యుడి ఈ రాశిలో ప్రవేశిస్తుండటం వల్ల అద్భుతమైన లాభాలు ఆర్జిస్తారు. పనిచేసేచోట సాఫల్యం ఉంటుంది. ఈ సమయంలో మీరు చేసే పనులకు ప్రశంసలు లభిస్తాయి. పదోన్నతి, ఇంక్రిమెంట్లు తప్పకుండా ఉంటాయి.

కుంభ రాశి

సూర్యుడి గోచారం శుభ ప్రభావం కుంభ రాశి జాతకుల జీవితంపై స్పష్టంగా పడుతుంది. కుంభ రాశి జాతకుల కుటుంబీకులకు చాలా బాగుంటుంది. కుటుంబంతో పాటు దీర్ఘకాలంగా వస్తున్న సమస్యలు తొలగిపోతాయి. పెళ్లికానివారికి పెళ్లియోగం ఉంటుంది.

వృషభ రాశి

జ్యోతిష్యం ప్రకారం సూర్యుడు వృషభ రాశి ఏకాదశ పాదంలో గోచారం చేయనున్నాడు. ఈ స్థానాన్ని ఆర్ధిక లాభం లేదా కోర్కెల పాదమంటారు. సూర్యుడి ఈ రాశి చతుర్ధపాదానికి అధిపతి. ఈ క్రమంలో మార్చ్ 15న గోచారంతో ఈ రాశివారికి విశేషమైన లాభముంటుంది. పెట్టుబడులకు అనువైన సమయం. ఇళ్లు, వాహనం కొనుగోళ్లుకు మంచి సమయం.

Also read: Guru Gochar 2023: 42 రోజుల తర్వాత ఈ 3 రాశుల వారి జీవితంలో అల్లకల్లోలం.. 6 నెలల పాటు అశుభాలే! మీ రాశి ఉందో చూడండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News