COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jupiter Transit: జ్యోతిష్య శాస్త్రంలో తొమ్మిది గ్రహాల గురించి క్లుప్తంగా వివరించారు. ఈ గ్రహాల గమనం లేదా నక్షత్ర సంచారం కారణంగా వ్యక్తుల జీవితాల్లో శుభ, అశుభ యోగాలు ఏర్పడతాయి. ఈ సంవత్సరం చివరిలో బృహస్పతి గ్రహం రాశి సంచారం చేయబోతున్నాడు. డిసెంబర్ 31న బృహస్పతి నేరుగా మేషరాశిలో సంచారం చేయనుంది. దీని కారణంగా కుల్ దీపక్ రాజయోగం ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ యోగం దాదాపు  500 ఏళ్ల తర్వాత మళ్లీ ఏర్పడబోతోంది. ఈ కుల్ దీపక్ రాజయోగం కారణంగా కొన్ని రాశులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ ప్రత్యేక యోగ ప్రభావంతో ఏయే రాశులవారి తల రాతలు మారబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 


సింహ రాశి:
బృహస్పతి ప్రత్యక్ష సంచారం చేయడం వల్ల ఏర్పడే కుల్ దీపక్ రాజయోగం కారణంగా సింహ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొంటుంది. ఇక వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో రెట్టింపు పొందుతారు. 


Also Read:  Allu Arjun: హాయ్ నాన్న రివ్యూ ఇచ్చేసిన అల్లు అర్జున్.. నానిపై ప్రశంసలు


మిథున రాశి:
కుల్ దీపక్ రాజయోగం మిథున రాశి వారిపై కూడా ప్రత్యేక ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ యోగం వీరికి చాలా శుభప్రదంగా ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ కూడా సులభంగా నెరవేరుతాయి. ఇక వ్యాపారాలు చేస్తున్నవారు పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని లాభాలు పొందుతారు. ఉద్యోగాలు చేసేవారు కూడా బాస్‌ల నుంచి సపోర్ట్‌ పొందడమే కాకుండా ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయి. మానసిక సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. అయితే వీరు ఈ సమయంలో ప్రయాణాలు చేసే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. 


కుంభరాశి:
కుంభ రాశి వారికి కుల్ దీపక్ రాజయోగం కారణంగా చాలా రకాల లాభాలు పొందుతారు. ఉద్యోగాలు చేసేవారు ఎప్పుడు వినలేని శుభవార్తలను కూడా వింటారు. దీంతో పాటు ఉద్యోగాల్లో స్థిరపడ్డవారికి జీతాలు కూడా పెరుగుతాయి. ఇక విద్యార్థులకు ఈ సమయం చాలా ముఖ్యమైనది. ఈ సమయంలో చదువులపై దృష్టి పెట్టడం భవిష్యత్‌లో మంచి ఫలితాలు పొందుతారు. అలాగే వైవాహిక జీవితం కూడా మధురంగా ​​ఉంటుంది.


Also Read:  Allu Arjun: హాయ్ నాన్న రివ్యూ ఇచ్చేసిన అల్లు అర్జున్.. నానిపై ప్రశంసలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి