Jupiter Transit 2023: 156 రోజులపాటు భరణి నక్షత్రంలో గురుడు.. మారనున్న వీరి జాతకం
Guru Gochar in Bharani Nakshatra 2023: ఇటీవల బృహస్పతి తన నక్షత్రాన్ని మార్చి భరణి నక్షత్రంలోకి ప్రవేశించాడు. గురుడు నక్షత్ర రాశి మార్పు మూడు రాశులవారికి లాభాలను ఇవ్వనుంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం..
Jupiter Transit in Bharani Nakshatra 2023: దేవగురువు బృహస్పతి సంవత్సరానికి ఒకసారి రాశిని మారుస్తాడు. ఈ ఏడాది ఏప్రిల్ 22న బృహస్పతి తన రాశిని మార్చాడు. అదే రాశిలో మే 01, 2024 వరకు ఉండనున్నాడు. రెండు రోజుల కిందట అంటే జూన్ 21న గురువు నక్షత్రాన్ని మార్చి భరణి నక్షత్రంలోకి ప్రవేశించాడు. నవంబరు 27న బృహస్పతి భరణి నక్షత్రాన్ని విడిచిపెట్టి అశ్వినీ నక్షత్రం యెుక్క మెుదటి దశలోకి ప్రవేశించనున్నాడు. దాదాపు 156 రోజులపాటు గురుడు భరణి నక్షత్రంలో ఉండటం వల్ల మూడు రాశులవారికి అదృష్టంతోపాటు ఐశ్వర్యం కలగనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
మేషం: గురు గ్రహం నక్షత్రం మార్పు వల్ల గురు-రాహువుల కలయిక వల్ల ఏర్పడిన గురు-చండాల యోగం తొలగిపోయింది. దీంతో మేషరాశి వారి పాత సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఉద్యోగ మరియు వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
Also Read: జూలై 17 వరకు మిథునరాశిలోనే సూర్యుడు.. ఈ 3 రాశులవారి ఇళ్ల నిండా డబ్బే డబ్బు..
మిథునం: గురు నక్షత్ర మార్పు మిథునరాశి వారికి లాభాలను ఇస్తుంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీరు డబ్బును ఆదా చేస్తారు. వ్యాపారులు మంచి లాభాలను గడస్తారు. మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. మీరు కొత్త ఇల్లు లేదా కారును కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు కొత్త వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంది. మీకు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి.
కర్కాటకం: గురు గ్రహ రాశి మార్పు కర్కాటక రాశి వారికి లాభాలను ఇస్తుంది. ఆగిపోయిన పని మెుదలవుతుంది. మీ ఆదాయం డబల్ అవుతుంది. మీ వివిధ వనరుల ద్వారా డబ్బు సమకూరుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. వ్యాపారులు మంచి పురోగతిని సాధిస్తారు. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.
Also Read: Sawan 2023 Rashifal: జూలై 4 నుంచి శ్రావణ మాసం.. 2 నెలలపాటు ఈ 5 రాశులపై నోట్ల వర్షం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి