Sun Transit 2023: జూలై 17 వరకు మిథునలోనే సూర్యుడు.. ఈ 3 రాశులవారి ఇళ్ల నిండా డబ్బే డబ్బు

Sun Transit 2023: సూర్యుడి మిథునరాశి ప్రవేశం కొన్ని రాశులవారికి కలిసిరానుంది. వీరు ఆకస్మిక ధనలాభం పొందడంతో వృత్తి, వ్యాపారాల్లో లాభపడతారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 25, 2023, 08:00 PM IST
Sun Transit 2023: జూలై 17 వరకు మిథునలోనే సూర్యుడు.. ఈ 3 రాశులవారి ఇళ్ల నిండా డబ్బే డబ్బు

Sun in Gemini till 17th July 2023: ఆస్ట్రాలజీలో సూర్యుడిని గ్రహాల రాజు అని పిలుస్తారు. ప్రస్తుతం మిథునరాశిలో సంచరిస్తున్న ఆదిత్యుడు జూలై 17 వరకు అదే రాశిలో ఉండబోతున్నాడు. పైగా మిథునరాశిని బుధుడు పాలిస్తున్నాడు. మెర్క్యూరీ రాశిలో సూర్యుడి సంచారం కొంత మందికి ప్రయోజనకరంగా ఉండనుంది. ఆ రాశులేవో తెలుసుకుందాం. 

సూర్య సంచారం ఈ రాశులకు వరం

కన్య రాశి
సూర్యుడి మిథునరాశి ప్రవేశం కన్యా రాశి వారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది. మీ వృత్తి మరియు వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. సూర్యుడు మీ రాశిచక్రం యొక్క పదవ ఇంట్లో ప్రయాణించబోతున్నాడు. దీని వల్ల మీకు కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయి. మీడియా, మార్కెటింగ్, ఫైనాన్స్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ సమయంలో లాభపడతారు. మీ బిజినెస్ విస్తరిస్తుంది. 

Also Read: Bakrid 2023: బక్రీద్ పండుగ ఎప్పుడు, ఎందుకు, ఎలా జరుపుకుంటారు, పండుగ నేపధ్యమేంటి

సింహరాశి
ఈరాశికి అధిపతి సూర్యుడు. పైగా ఈ రాశిచక్రంలో 11వ ఇంట్లో ఆదిత్యుడి సంచారం జరిగింది. దీని వల్ల వీరి ఆదాయం విపరీతంగా పెరగనుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. సంతానప్రాప్తి కలుగుతుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది. 

ధనుస్సు రాశి
సూర్యుడు మిథునరాశిలో ఉండటం వల్ల ధనస్సు రాశి వారు మంచి ఫలితాలు పొందుతారు. ఈరాశి వారి సంచారం ఏడో ఇంట్లో జరగబోతుంది. దీంతో వీరి వైవాహిక జీవితం బాగుంటుంది. మీకు లైఫ్ పార్టనర్ సపోర్టు లభిస్తుంది. మీరు లవ్ లైవ్ ను ఎంజాయ్ చేస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు. 

Also Read: Venus transit 2023: సింహరాశి ప్రవేశం చేయనున్న రాక్షసుల గురువు.. ఈ 4 రాశులకు తిరుగులేదు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News