Astrology: 12 సంవత్సరాల తర్వాత అరుదైన యోగం.. ఈ రాశులకు ఊహించనంత ధనం..
Navapancham RajYoga: నవంబరులో మూడు గ్రహాల కలయికల వల్ల నవపంచమ రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల 3 రాశుల వారు భారీగా ప్రయోజనాలు పొందనున్నారు.
Navapancham RajYoga: ఆస్ట్రాలజీ లెక్కల ప్రకారం, ప్రతి గ్రహం తన రాశిని మార్చినప్పుడు అది మెుత్తం 12 రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. రీసెంట్ గా బుధుడు, శుక్రుడు మరియు సూర్యుడు వృశ్చిక రాశిలో సంచరించారు. నవంబరు 11న శుక్రుడు, 13న బుధుడు, 16న సూర్యుడితో గురు గ్రహం నవ పంచమ రాజయోగాన్ని సృష్టించింది. ఇది 12 సంవత్సరాల తర్వాత ఏర్పడింది. ఈ గురు, బుధ, సూర్య, శుక్ర గ్రహాల నవపంచమ రాజయోగం (Navpancham Rajyog) వల్ల కొన్ని రాశులవారు భారీగా ప్రయోజనాలను పొందనున్నారు. ముఖ్యంగా 3 రాశులవారు గరిష్ట లాభాన్ని పొందుతారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
నవ పంచమ రాజయోగం ఈ రాశులకు శుభప్రదం
వృషభరాశి (Taurus): నవపంచమ రాజయోగం వల్ల వృషభరాశి వారి అదృష్టం ప్రకాశిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. కుటుంబంలో ఆనందం ఉంటుంది. మీ వైవాహిక జీవితం సంతోషంతో నిండిపోతుంది. మెుత్తానికి ఈసమయం మీకు శుభప్రదంగా ఉంటుది.
కర్కాటక (Cancer): ఈ రాశి వారికి నవపంచమ రాజయోగం చాలా మేలు చేస్తుంది. ఆగిపోయిన పనులను పూర్తిచేస్తారు. వీరు ఏ పని తలపెట్టిన అందులో విజయం సాధిస్తారు. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. మీ వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. ఫ్యామిలీతో మంచి సమయం గడుపుతారు. వ్యాపారులు భారీగా లాభపడతారు.
కుంభం(Aquarius): నవపంచమ రాజయోగం ఈ రాశి వారికి భారీగా లాభాలను ఇస్తుంది. మీకు అదృష్టం కలిసి వస్తుంది. తద్వారా మీరు ప్రతి పనిని సులభంగా పూర్తిచేస్తారు. వ్యాపారంలో రెట్టింపు లాభాలు ఉంటాయి. బిజినెస్ విస్తరిస్తుంది. నిరుద్యోగులకు జాబ్ వస్తుంది. మీరు ఒత్తిడి నుండి బయటపడతారు. ఉద్యోగులకు కూడా ఈ సమయం అద్భుతంగా ఉంటుంది.
Also Read: Guru Margi 2022: మీనంలో నడవనున్న గురుడు.. ఈ 5 రాశులవారిని వరించిన అదృష్టం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి