Jupiter Transit in Taurus 2024: అష్ట గ్రహాల్లో బృహస్పతి కూడా ఒకరు. పురాణాల ప్రకారం, ఇతడిని దేవగురువుగా పిలుస్తారు. ఆస్ట్రాలజీ ప్రకారం, అదృష్టం, సంపద, వివాహం, సంతానానికి కారకుడిగా బృహస్పతి గ్రహాన్ని భావిస్తారు. పైగా ధనస్సు మరియు మీన రాశులకు అధిపతి. 13 నెలలకొకసారి బృహస్పతి తన రాశిని మారుస్తుంది. ప్రస్తుతం మేషరాశిలో సంచరిస్తున్న గురుడు.. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో తన రాశిని మార్చి వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. బృహస్పతి రాశి మార్పు వల్ల మూడు రాశులవారు విపరీతమైన ప్రయోజనాలు పొందబోతున్నారు. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కన్య రాశి
వచ్చే ఏడాది కన్యా రాశి వారు మంచి ఫలితాలను పొందుతారు. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. విదేశాలకు వెళ్లాలనే మీ కోరిక నెరవేరుతుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. మీరు కారు లేదా ల్యాండ్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. 
మేష రాశి
రాబోయే కొత్త సంవత్సరం మేషరాశి వారికి ఆకస్మిక ధనలాభాన్ని ఇస్తుంది. మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీరు అప్పుల బాధ నుండి బయటపడతారు. మీ వ్యక్తిత్వంతో అందరినీ ఆకర్షిస్తారు. మీరు డబ్బును బాగా పొదుపు చేస్తారు. మీరు అన్ని రకాల సమస్యల నుండి బయటపడతారు. 
సింహరాశి
2024 సంవత్సరం సింహ రాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. జాబ్ చేసేవారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. ప్రభుత్వం ఉద్యోగం సాధించాలనుకునే వారి కల నెరవేరుతుంది. 


Also Read: Karva Chauth 2023: కర్వా చౌత్‌ పండగ అప్పుడే..వ్రతాన్ని ఆచరించేవారు తప్పక తెలసుకోవాల్సి విషయాలు ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి