Karva Chauth 2023: కర్వా చౌత్‌ పండగ అప్పుడే..వ్రతాన్ని ఆచరించేవారు తప్పక తెలసుకోవాల్సి విషయాలు ఇవే!

Karva Chauth Date 2023: కర్వా చౌత్‌ పండగ నార్త్‌ ఇండియన్స్‌కి ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ రోజు చంద్రుడిని పూజించి ప్రత్యేక పూజలు చేస్తారు. అంతేకాకుండా చంద్రుడికి అర్ఘ్యం సమర్పిస్తారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 9, 2023, 08:54 AM IST
Karva Chauth 2023: కర్వా చౌత్‌ పండగ అప్పుడే..వ్రతాన్ని ఆచరించేవారు తప్పక తెలసుకోవాల్సి విషయాలు ఇవే!

 

Karva Chauth Date 2023: ఉత్తరాది రాష్ట్రాల్లో కర్వా చౌత్‌ పండగకు ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. ప్రతి సంవత్సరం ఈ పండగను కార్తీక కృష్ణ పక్ష చతుర్థి రోజున జరుపుకుంటారు. కర్వా చౌత్‌ పండగను పురష్కరించుకుని భర్త దీర్ఘాయుష్షు కోసం భార్యలందరూ దేవతా ముర్తులకు ప్రత్యేక పూజలు చేసి ఉపవాసాలు పాటిస్తారు. అంతేకాకుండా స్త్రీలు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నిర్జల వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని పాటించేవారు చంద్రుడు వచ్చిన తర్వాత మాత్రమే ఆహారాలు తీసుకుంటారు. అయితే ఈ సంవత్సరం కర్వా చౌత్‌ పండగ తేదిలో గందరగోళం నెలకొంది. ఈ పండగ విశిష్టత, తేది, శుభసమయాల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కర్వా చౌత్ ఎప్పుడంటే?
ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని కృష్ణ పక్ష చతుర్థి తిథి రోజున  కర్వా చౌత్ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితిగా వస్తోంది. అయితే ఈ సంవత్సరం చతుర్థి తిథి నవంబర్ 1వ రాబోతోంది. కాబట్టి ఈ రోజు ఉపవాసాలు పాటించడానికి సరైన సమయంగా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ ఉపవాసాలు పాటించేవారు నవంబర్ 1 బుధవారం ఉదయం 6:35 నుంచి  8:26 వరకు మంచి పూజా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. 

కర్వా చౌత్ శుభ సమయం:
కార్తీక కృష్ణ పక్ష చతుర్థి తిథి ప్రారంభం: 31 అక్టోబర్ 2023, రాత్రి 09:30 నుంచి..
కార్తీక కృష్ణ పక్ష చతుర్థి తిథి ముగింపు: రాత్రి 09:19, 01 నవంబర్ వరకు..
పూజా సమయం: నవంబర్ 01 సాయంత్రం 05:44 నుంచి రాత్రి 07:02 వరకు..
కర్వా చౌత్‌ చంద్రోదయం సమయం: నవంబర్ 01 రాత్రి 08:26

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

కర్వా చౌత్ పూజ విధానం:
కర్వా చౌత్ వ్రతాన్ని ఆచరించేవారు తప్పకుండా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాల్సి ఉంటుంది. 
ఆ తర్వాత గంగా జలంతో స్నానాన్ని ఆచరించాలి.
తప్పకుండా పట్టు వస్త్రాలను మాత్రమే ధరించాల్సి ఉంటుంది.  
ఇంటిని, పూజాగదిని శుభ్రం చేయాల్సి ఉంటుంది.
కర్వా చౌత్ ఉపవాసం పాటించేవారు ఉదయం పూట కూడా పూజను చేయాల్సి ఉంటుంది.
సాయంత్రం శుభ సమయంలో వ్రత కథను పఠించాలి.
తర్వాత చంద్రుడిని ప్రత్యేక సమయాల్లో పూజించాలి.
 చంద్రుడిని చూసి అర్ఘ్యం సమర్పించి..నమస్కరించాల్సి ఉంటుంది. 
ఆ తర్వాత చండ్రుకి హారతిని సమర్పించి..జల్లెడ నుంచి భర్త ముఖాన్ని చూడాల్సి ఉంటుంది. 
ఇలా చేసిన తర్వాత భర్త భార్యకు నీరు ఇచ్చి ఉపవాసం విరమిస్తారు. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News