Guru Asta Effect On Zodiac Sign: ఆస్ట్రాలజీలో బృహస్పతిని శుభగ్రహంగా భావిస్తారు. గురు గ్రహగమనంలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ప్రస్తుతం బృహస్పతి మీనరాశిలో సంచరిస్తున్నాడు. అయితే గురుడు ఈ నెల 28న అదే రాశిలో అస్తమించబోతున్నాడు. ఈ బృహస్పతి అస్తమయ సమయంలో శుభకార్యాలన్నీ నిలిపివేస్తారు. సాధారణంగా గ్రహాల అస్తమయం రాశులపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అయితే ఈ గురుడు అస్తమయం మాత్రం కొన్ని  రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గురుడు అస్తమయం ఈ రాశులకు వరం
మేషరాశి
బృహస్పతి అస్తమించడం వల్ల మేషరాశి వారి జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీరు ప్రతి పనిని విజయవంతంగా పూర్తిచేస్తారు. ధనలాభం ఉంటుంది. మీరు ఆర్థికంగా బలపడతారు. దాంపత్య జీవితం బాగుంటుంది. అదృష్టం కలిసి వస్తుంది. 
తులారాశి
గురుడు అస్తమయం ఈ రాశి వారికి వరం. మీరు అడుగుపెట్టినా ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. మీ ఉద్యోగ మరియు వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. మీరు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. మిమ్మల్ని ప్రతి పనిలో విజయం వరిస్తుంది. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడిపే అవకాశం ఉంది.
మీనరాశి
మీన రాశి వారికి కూడా ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. వీరికి అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. 
కుంభ రాశి
గురుడు అస్తమయం కుంభరాశి వారికి మేలు చేస్తుంది. మీరు ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. మీరు విశేష ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో లాభపడతారు. ఆర్థికంగా మీరు మెరుగుపడతారు. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది. 


Also Read: Budh Gochar 2023: మేషరాశి ప్రవేశం చేయనున్న గ్రహాల యువరాజు.. ఈ 4 రాశులకు కష్టాలు షురూ..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook