Jyeshtha Purnima 2023: జ్యేష్ఠ పూర్ణిమ రోజు ఈ పరిహారాలు పాటిస్తే, లక్ష్మిదేవి అనుగ్రహం లభించడం ఖాయం!
Jyeshtha Purnima 2023: జ్యేష్ఠ పూర్ణిమ రోజు ఈ పరిహారాలతో లక్ష్మిదేవిని పూజించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Jyeshtha Purnima 2023: ప్రతి నెల పౌర్ణమి లక్ష్మీదేవిని పూజించడం ఆనవాయిగా వస్తోంది. ఈ సారి జ్యేష్ఠ మాసం పౌర్ణమి జూన్ 3న వస్తోంది. అయితే ఈ సమయంలో దానం చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా జ్యేష్ఠ మాసం పౌర్ణమి రోజు లక్ష్మీ దేవిని పూజించడంతో పాటు జపం, తపస్సును భక్తి శ్రద్ధలతో చేయడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇదే క్రమంలో పవిత్ర నదిలో స్నానం ఆచరించడం వల్ల కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.
పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఐశ్వర్య వంతులవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా పౌర్ణమి రోజున విష్ణువు పూజించడం వల్ల ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. అయితే ఈ పరిహారాలు పాటించడం వల్లే అన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయి. జ్యేష్ఠ పౌర్ణమి రోజున విష్ణు, లక్ష్మీ దేవిలను ఎలా పూజించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత
జ్యేష్ఠ పూర్ణిమ రోజు పాటించాల్సిన పరిహారాలు:
❂ జ్యేష్ఠ పూర్ణిమ రోజున లక్ష్మీదేవిని పూజించేవారు తప్పకుండా గంగా నది స్నానం చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇంటిని కూడా గంగా జలంతో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పూజా కార్యక్రమాలు ప్రారంభించాల్సి ఉంటుంది.
❂ లక్ష్మీ దేవి పూజా కార్యక్రమంలో భాగంగా తప్పకుండా పసుపు రంగు పుష్పాలు, పండ్లు నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాకుండా పూజ ముగిసే దాకా ఉపవాసం పాటించాలి. ఇలా చేయడం వల్లే లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
❂ జ్యేష్ఠ పూర్ణిమ పూజలో అమ్మవారికి తెలుపు రంగుల స్వీట్లను కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. లక్ష్మీ స్తోత్రం చదువుతూ హారతి ఇవ్వడం వల్ల ఆర్థిక సమస్యలు సులభంగా దూరవముతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యులు కూడా తగ్గుతాయి.
❂ లక్ష్మీ దేవి అనుగ్రహం పొందడానికి తప్పకుండా పూజలో భాగంగా పసుపు, ఎరుపు రంగుతో కూడిన పువ్వులను సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ క్రమంలో లక్ష్మిని ధ్యానించండం వల్ల కూడా ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది.
❂ జ్యేష్ఠ మాసం పౌర్ణమి రోజున వస్తువులను దానం చేయడం వల్ల కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. తీవ్ర సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి.
Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook