Kalashtami 2022 Shubh Muhurat: కాలాష్టమి వ్రతం శివుని రుద్రావతారమైన కాల భైరవుడిని ప్రసన్నం చేసుకోవడానికి  చేస్తారు. ఈ వ్రతాన్ని (Kalashtami vratham 2022) వైశాఖ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి నాడు ఆచరిస్తారు. అంటే రేపు (ఏప్రిల్ 23, శనివారం) ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ రోజున, కాల భైరవుడికి ఉపవాసం ఉండి, పూజలు చేస్తారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వ్యాధుల నుండి విముక్తి
కాల భైరవుడిని పూజించడం వల్ల రోగాలు, తెలియని భయం, అకాల మృత్యువు భయం వంటివి తొలగిపోతాయని నమ్ముతారు. కాబట్టి, ఈ వ్రతాన్ని శుభ సమయంలో ఆచరించాలి. ఈసారి వైశాఖ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి ఏప్రిల్ 23 శనివారం ఉదయం 06:27 గంటలకు ప్రారంభమై.. ఏప్రిల్ 24 ఆదివారం ఉదయం 04:29 గంటలకు ముగుస్తుంది.


కాలాష్టమి పూజ ముహూర్తం 2022:
ఈసారి కాలాష్టమి వ్రతం రోజున త్రిపుష్కర యోగం, సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతున్నాయి. అటువంటి శుభ యోగంలో పూజించడం వల్ల లభించే ఫలం పెరుగుతుంది. సర్వార్థ సిద్ధి యోగం ఏప్రిల్ 23 సాయంత్రం 06:54 నుండి ఏప్రిల్ 24 ఉదయం 05:47 వరకు ఉంటుంది. అదే సమయంలో, త్రిపుష్కర యోగా ఏప్రిల్ 23 ఉదయం 05:48 నుండి ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 06:27 వరకు ఉంటుంది. కాబట్టి, భక్తులు ఏప్రిల్ 23 ఉదయం నుండి రాత్రి వరకు ఎప్పుడైనా పూజించవచ్చు. కాగా అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుండి 12:46 వరకు ఉంటుంది.


కాలాష్టమి వ్రతం ఎలా చేయాలి?
కాలాష్టమి రోజున ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. అప్పుడు ఉపవాస వ్రతం చేసి సూర్యభగవానునికి నీటిని సమర్పించండి. అప్పుడు కాలభైరవ దేవుడిని పూజించండి. అతనికి పంచామృతం, పాలు, పెరుగు, బిల్వ పత్రాలు, దాతురా, పండ్లు, పువ్వులు, ధూప దీపాలు మొదలైన వాటిని సమర్పించండి. చివరికి శివుని హారతి చేయండి. మీ కోరిక తీర్చమని దేవుడిని ప్రార్థించండి. కాలాష్టమి వ్రతంలో, రోజంతా ఏమీ తినకూడదు మరియు సాయంత్రం హారతి తర్వాత, పండ్లు తినవచ్చు. మరుసటి రోజు ఉదయం స్నానం చేసి పూజ చేసి ఉపవాసం విరమించాలి.


Also Read: Solar Eclipse 2022: సూర్యగ్రహణం రోజున ఈ రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook