Solar Eclipse 2022: ఈ ఏడాది తొలిగా సూర్య గ్రహణం ఏర్పడనుంది. ఇది 2022 ఏప్రిల్ 30న (శనివారం) సంభవించనుంది. ఈ గ్రహణం రాశిచక్రంపై కూడా ప్రభావం చూపనుంది. అందులోని 3 రాశుల వారు సూర్య గ్రహణం సంభవించే రోజున జాగ్రత్తగా ఉండాలని జోతిష్య్కులు సూచిస్తున్నారు. అయితే ఆ రాశుల వివరాలేంటో తెలుసుకుందాం.
సూర్య గ్రహణం ఏర్పడే సమయం..
ఈ ఏడాది ఏర్పడనున్న మొదటి సూర్య గ్రహణం.. భారత కాలమానం ప్రకారం ఏప్రిల్ 30 (శనివారం) అర్ధరాత్రి 12.15 నుంచి ఉదయం 04.08 గంటల వరకు కొనసాగనుంది. ఈ గ్రహణం సమయంలో మేషరాశిలో సూర్యుడు, చంద్రుడు, రాహువు కలయిక ఏర్పడనుంది. ఈ క్రమంలో రాశీచక్రంలోని మూడు రాశుల వారికి ఈ గ్రహణం ప్రతికూల ప్రభావం చూపనుందని జోతిష్య నిపుణులు అంటున్నారు. అలాంటి వారు ఈ పరిహార చర్యలు తీసుకోవడం మంచిది.
మేషరాశి (Aries)
ఏప్రిల్ 30 ఏర్పడనున్న సూర్య గ్రహణం మేషరాశిలో మాత్రమే సంభవించనుంది. కాబట్టి ఈ రాశి వారు మానసిక ఒత్తిడిని ఎదుర్కొవాల్సి రావొచ్చు. దీంతో పాటు శత్రువుల నుంచి నష్టం లేదా ప్రమాదం జరగవచ్చు. అలాగే సూర్య గ్రహణం సంభవించే సమయంలో ఈ రాశి వారు ప్రయాణం మానుకుంటే మేలు.
కర్కాటక రాశి (Cancer)
కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. సూర్యగ్రహణం వల్ల ఈ రాశి వారు ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ సమయంలో తెలియని వారు తమపై ఆధిపత్యం చలాయించే అవకాశం ఉంది. దీంతో పాటు ఖర్చులు పెరగుతుంటాయి. ఓపిగ్గా ఉండండి.
వృశ్చికరాశి (Scorpio)
సూర్యగ్రహణం కారణంగా వశ్చిక రాశి వారికి కూడా అనుకూల కాలం లేదు. సమాజంలో గౌరవాన్ని కోల్పోయే సందర్భం ఉంది. వివాదాల పట్ల జాగ్రత్తగా ఉండడం సహా ఆలోచనాత్మకంగా మాట్లాడండి. తమకు హాని కలిగించే విధంగా శత్రువులు ప్రయత్నించవచ్చు.
సూర్యగ్రహణం వల్ల కలిగే ప్రభావాలను నివారించే మార్గాలు..
సూర్య గ్రహణం ద్వారా ఎదురయ్యే ప్రతికూల ప్రభావాన్ని నివారించుకునేందుకు గాయత్రీ మంత్రాన్ని జపించడం మేలు. గ్రహణ సమయంలో ఏ ఆహార పదార్థాలను తినకండి. ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. సానుకూల ఆలోచన ధోరణితో ఉండడంతో పాటు ఇష్ట దైవాన్ని ఆరాధించాలి.
(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా జోతిష్య నిపుణుల నుంచి సేకరించినది. వీటిని పాటించే ముందు మీ దగ్గర్లోని జోతిష్య్కులను సంప్రదించడం మేలు. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)
Also Read: Solar Eclipse 2022 Date: తొలి సూర్యగ్రహణం 2022, ఏప్రిల్ 30వ తేదీన..ఎన్ని గంటలకు, ఏం చేయకూడదు
Also Read: Akshaya Tritiya: అక్షయ తృతీయ ఎప్పుడు, ఏ సమయంలో.. లాభాలేంటి, ఏం చేయాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.