Kamika Ekadashi 2022: శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి (Kamika Ekadashi 2022) రేపు అంటే జూలై 24న వస్తుంది. ఈ ఏకాదశినే కామిక ఏకాదశి అంటారు. ఈ రోజున శ్రీమహావిష్ణువును (Lord vishnu) పూజిస్తారు. శ్రావణ ఏకాదశి చేయడం వల్ల శ్రీహరి అనుగ్రహంతోపాటు శివుడి కటాక్షం కూడా మీపై ఉంటుంది. ఈసారి కామిక ఏకాదశి రోజు 3 శుభయోగాలు ఏర్పడుతున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుభ సమయం
కామికా ఏకాదశి ఆదివారం ఉదయం 11:27 గంటలకు ప్రారంభమై.. సోమవారం మధ్యాహ్నం 01:45 గంటలకు ముగుస్తుంది. ఈ రోజున ద్విపుష్కర యోగం, వృద్ధి యోగం, ధ్రువ యోగం ఏర్పడుతున్నాయి. వృద్ధి యోగం రేపు ఉదయం నుండి మధ్యాహ్నం 02:02 వరకు, ఆ తర్వాత ధ్రువ యోగం మెుదలవుతుంది. అయితే ద్విపుష్కర యోగం రేపు ఉదయం 10 నుండి మరుసటి రోజు ఉదయం 05:38 వరకు ఉంటుంది. మీరు రేపు కామికా ఏకాదశి వ్రతం ఆచరిస్తున్నట్లయితే...మీరు జూలై 25 ఉదయం 05:38 నుండి ఉపవాసం విరమించవలసి ఉంటుంది. 08:22 వరకు మాత్రమే పారణ సమయం.


ఏకాదశి వ్రతానికి శాస్త్రీయ ఆధారం
అమావాస్య మరియు పౌర్ణమి రోజుల్లో భూమి చుట్టూ వాతావరణ పీడనం ఎక్కువగా ఉంటుంది. ఇది మానవ మనస్సు మరియు మెదడుపై దుష్ప్రభావాన్ని చూపుతుంది. ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల శరీరంలోని జీర్ణవ్యవస్థ సక్రమంగా ఉండి.. శరీరం, మనసు స్వచ్ఛంగా ఉంటాయి. వారానికి లేదా పక్షం రోజులకు ఒకసారి తప్పనిసరిగా ఉపవాసం చేస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 


గ్రంథాలు ఏమి చెబుతున్నాయి?
ఏకాదశిని మించిన ఉపవాసం లేదని గ్రంథాలు చెబుతున్నాయి. ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కార్యేంద్రియాలు మరియు ఒకే మనస్సు.. ఈ పదకొండింటిని పెంపొందించుకున్న వ్యక్తి ఏకాదశి వలె పవిత్రంగా మరియు దైవంగా ఉంటాడు. మీరు ఏకాదశి నాడు ఉపవాసం చేయడం ద్వారా మీ మనస్సును కంట్రోల్  చేయవచ్చు. ఏకాదశి వ్రతం మనస్సులోని అశాంతిని తొలగిస్తుంది.


Also Read:Mangala Gauri Vrat 2022: ఒకేరోజు శివరాత్రి, మంగళ గౌరీ వ్రతం... శుభముహూర్తం తెలుసుకోండి



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook