Karthika Masam 2022 Start Date And End Date: కార్తీకమాసానికి హిందూ సాంప్రదాయంలో ప్రత్యేకమైన ప్రముఖ్యత ఉంది. భారత్‌లో ఇప్పటికే ఈ మాసానికి సంబంధించిన సమయాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ క్రమంలో భక్తులంతా శివారాధన చేస్తారు. ఈ క్రమంలో శివున్ని పూజించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరడమేకాకుండా అన్ని రకాల సమస్యలు దూరమవుతాయని భక్తుల నమ్మకం. అందుకే ఈ  కార్తీకమాసంలో శివున్ని తరిస్తూ భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు పాటిస్తారు. అయితే భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు పాటించి శివుని సంబంధించిన అతి శక్తి వంతమన దేవాలయాలను దర్శించడం వల్ల సంతాన సమస్యలు కూడా తీరుతాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంలో ఏ ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలను దర్శించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తప్పకుండా ఈ దేవాలయాలను దర్శించండి:


సంతాన సాంబశివుడు:
అతి ప్రముఖ్యత కలిగిన సామర్లకోట శివాలయాన్ని ఈ కార్తీక మాసంలో దర్శిస్తే మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఈ దేవాలయం పల్నాడు జిల్లాలో ఉంటుంది. సంతాన సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ దేవాలయానికి వెళ్లి సంతాన సాంబశివుడిని పూజిస్తే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతేకాకుండా శివుని అనుగ్రహం కూడా లభిస్తుంది.


అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వర స్వామి:
నకరికల్లు ఉండే అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వర స్వామి కూడా మంచి ప్రముఖ్యత ఉంది. కార్తీకమాస సమయంలో ఈ దేవాలయాన్ని సందర్శించి దర్శించడం వల్ల మంచి మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అంతేకాకుండా ఈ శివుడు స్వయంభువుగా వెలిశాడని అక్కడి ప్రజలు నమ్ముతారు. అయితే ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ శివుడికి అభిశేకం చేయడం వల్ల సమస్యలున్నీ తీరుతాయని అక్కడి ప్రజల నమ్మకం.


అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వర స్వామి మహత్యం:
నకరికల్లు చెందిన రసింగపాడు గ్రామంలో ప్రజలంతా అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వర స్వామి భక్తి శ్రద్ధలతో నిత్యం పూజిస్తారు. అయితే ఈ శివుడు వెలసిన నుంచి నీటికి ఎలాంటి డోకా లేదని ఆ గ్రామస్తులు చెబుతారు. అంతేకాకుండా ఈ శివుని దయ వల్ల ఇప్పటికి ఇక్కడ పాడిపంట నష్టం జరగలేదని అక్కడి ప్రజలు పేర్కొన్నారు. వర్షాలు పడినా పడకపోయిన స్వామి వారి దయ వల్ల ఎలాంటి పంట నష్టాలు రాలేదట.


అక్కడ వెలసిన శివలింగం సిద్దులు పూజించించిది కావడంతో ఆ ప్రదేశాలని ఎంతో ప్రత్యేక ఉంది. అయితే జీవితంలో ఒక్కసారైనా శివలింగాన్ని దర్శించి పూజించడం వల్ల పుత్ర సంతానం కలుగుతుందని అక్కడి ప్రజలు నమ్ముతారు. అంతేకాకుండా ఈ ఆలయాని ఓ ప్రత్యేక ఉంది. బాలారిష్ట దోషాలు ఉన్నవారు ఈ లింగాన్ని పూజించడం వల్ల అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయని ఆ గ్రామస్తులు చెబుతున్నారు.


Also Read: Nara Brahmani: జయలలిత ఫామ్‌హౌస్ నారా బ్రాహ్మిణి కొనుగోలు..? సోషల్ మీడియాలో ప్రచారం.. టీడీపీ క్లారిటీ


Also Read: RGV Meets CM YS Jagan : వైఎస్ జగన్‌తో ఆర్జీవీ భేటీ.. పవన్ కళ్యాణ్ పరువుతీసేందుకే కుట్ర?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి