karthika masam 2024: కలలో పాములు కన్పిస్తున్నాయా..?.. మీ సుడి తిరిగినట్లే.. పండితులు ఏమంటున్నారంటే..?
Snake In Dream: కొందరు పడుకొగానే పాములు కలలో కన్పిస్తుంటాయి. పాములు పక్క నుంచి వెళ్లినట్లు కన్పిస్తాయి. మరికొందరికి మాత్రం పాములు కోపంతో కాటు వేసినట్లు, వెంట పడినట్లు కన్పిస్తుంటాయి. వీటి వెనుక నిగూఢమైన అర్థముందని పండితులు చెప్తుంటారు.
Snakes In Dream Effect: కార్తీక మాసం ప్రారంభమైంది. చాలా మంది ఈ మాసంలో శివ, కేశవులను భక్తితో కొలుచుకుంటారుు. అంతే కాకుండా.. ఉదయం పూట సూర్యోదయం కన్నా ముందు నిద్రలేచీ స్నానాదులు చేస్తుంటారు. దేవుడి దగ్గర దీపారాధన చేస్తుంటారు. మాసాలన్నింటిలో కన్నా.. కార్తీకం శివ, కేశవులకు ఎంతో ప్రీతీకరమైందని చెప్తుంటారు. ఈ మాసంలోనే విష్ణు దేవుడు ఏకాదశి రోజున తిరిగి నిద్ర నుంచి మేల్కొంటాడంట. అందుకే కార్తీక మాసంను ఎంతో పవిత్రంగా భావిస్తారు.
అయితే.. ఈమాసంలో మనం చేసే పూజలు, వ్రతాలు కూడా రెట్టింపు ఫలితాలను ఇస్తాయని పండితులు చెబుతుంటారు. అయితే.. ప్రస్తుతం కార్తీక మాసంలో కలలో ఏవి కన్పిస్తే , ఎలాంటి ఫలితాలు కల్గుతాయో ఇప్పుడు చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మనకు పడే కలలు కూడా మన జీవితంపై ప్రభావం చూపుతాయని చెప్తుంటారు. అయితే.. కార్తీక మాసంలో కలలో పాములు కన్పిస్తే జీవితంలో మంచి రోజులు రానుండంకు సూచికగా చెప్తుంటారు. నల్లని పాము కన్పిస్తే.. మాత్రం రానున్న ఒక చెడు సంఘటనను సూచిస్తుందంట.
గోధుమ రంగు పాము కన్పిస్తే.. బంగారం, నిధులు మీ సొంతమౌతాయి. కలలో పాము మనల్ని చూసి బుసలు కొడుతూ.. చూస్తు ఉంటే.. అది మన వంక తన ఆశీర్వాదంనుచూపిస్తుందని అర్ధం. అదే పాము కనుక కోపంతో చూసుకుంటూ.. కాటు వేసేందుకు వస్తే మాత్రం ఏదో చెడు జరగనుందని అలర్ట్ అయి పోవాలి. అదే విధంగా పాముల్ని మాత్రం ఎప్పుడు చంపకూడదు. చాలా మంది పాముల్ని చూడగానే చంపేందుకు ప్రయత్నిస్తారు. దీని వల్ల లేనీ పోనీ దోషాలు వస్తాయి.
పాములకు ఎట్టి పరిస్థితుల్లో హనీ తలపెట్టకూడదంటారు పండితులు. పాములు ఎలుకల్ని తింటూ రైతులకు సహాయం చేస్తాయి. ఎలుకలు వడ్లు, బియ్యం తింటూ రైతులకు నష్టపరుస్తాయి. కానీ పాములు అలాంటి ఎలుకల్ని తింటూ వాటి బారినుంచి రైతుల్ని కాపాడుతుంటాయి. అనాదీగా పాములను దైవంగా భావిస్తారు. అందుకే నాగ పంచమి, సుబ్రహ్మాణ్య స్వామి అవతారంగా పాముల్ని భావిస్తారు. రాహు, కేతు దోషాలున్న వారు జంట నాగుల్ని పూజించాలని చెప్తుంటారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.