Karthika Masam: పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవడంతో తెలంగాణ పర్యాటక శాఖ భక్తులకు అద్భుతమైన పర్యాటక ప్లాన్‌తో ముందుకు వచ్చింది. రమణీయమైన ప్రకృతి అందాలతో కూడిన ఆధ్యాత్మిక యాత్రను పర్యాటక శాఖ సిద్ధం చేసింది. దేశంలోనే ప్రఖ్యాత జ్యోతిర్లింగమైన శ్రీశైలానికి పర్యాటక విభాగం మంచి ఆఫర్లు అందిస్తోంది. శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ అయిన సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణం వివరాలను వెల్లడించింది. అంతేకాకుండా నాగార్జున సాగర్‌ నుంచి శ్రీశైలం లాంచీ ప్రయాణ ప్యాకేజీని కూడా ప్రకటించింది. ఆ వివరాలు ఏమిటో తెలుసుకోండి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Aghori: అఘోరీని ఇంట్లోకి రానివ్వని కుటుంబీకులు.. నగ్నంగా వస్తే ఎలా రానిస్తాం?


 


కార్తీక మాసం పురస్కరించుకుని సోమశిల నుంచి శ్రీశైలానికి, నాగా‌ర్జున సాగ‌ర్ నుంచి శ్రీశైలానికి లాంచీ (క్రూయిజ్) సేవ‌లు న‌వంబ‌ర్ 2వ తేదీ నుంచి ప్రారంభమైనట్లు ప‌ర్యాట‌క శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు  ప్రకటించారు. కృష్ణా నది ఒడిలో.. దట్టమైన న‌ల్ల‌మ‌ల అడవుల అందాలను వీక్షిస్తూ నదిలో  జల విహారానికి తెలంగాణ పర్యాట‌క శాఖ అన్ని ఏర్పాట్లు చేసింద‌ని వివరించారు. ప్రయాణికులు, భక్తుల కోసం టూర్ ప్యాకేజీలు ప్రకటించినట్లు వెల్లడించారు.

Also Read: Diwali 2024: దీపావళికి 200 ఏళ్లుగా ఆ గ్రామం దూరం.. మన ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కడో తెలుసా?


 


లాంచీ ప్రయాణం కోసం అన్ని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో సురక్షిత ప్రయాణం అందిస్తున్నట్లు పర్యాటక తెలిపింది. ప్రకృతి రమణీయ అందాలను ఆస్వాదిస్తూనే ఆధ్యాత్మికంలో కూడా మునిగిపోవచ్చని.. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోవచ్చని టీఎస్‌టీడీసీ పేర్కొంది. రెండు ప్యాకేజీల లాంచీ ప్రయాణానికి సంబంధించిన ఇతర వివరాలు, బుకింగ్​ కోసం https://tourism.telangana.gov.in/ను సందర్శించాలని సూచించారు. లేదా తమ ఫోన్‌ నంబర్‌కు ఫోన్‌ చేసి కూడా పూర్తి వివ‌రాలు తెలుసుకోవాల‌ని వెల్లడించింది.


ప్యాకేజీ వివ‌రాలు


  • సోమశిల నుంచి శ్రీశైలం, నాగా‌ర్జున సాగ‌ర్ నుంచి శ్రీశైలం వ‌ర‌కు సింగిల్‌ రైడ్‌తోపాటు రౌండప్‌ క్రూయిజ్‌ జర్నీ ధరలను పర్యాటక శాఖ నిర్ణ‌యించింది. ఈ   రెండు వేర్వేరు ప్యాకేజీల‌కు ఒకే ర‌క‌మైన‌ టికెట్ ధరలే ఉన్నాయి.

  • సింగిల్‌ జర్నీలో పెద్దల‌కు రూ.2 వేలు, చిన్నారులకు రూ.1,600, రౌండప్  (రానుపోను) ప్రయాణంలో పెద్దల‌కు  రూ.3,000, పిల్లలకు రూ.2,400 గా ధర నిర్ణయించారు. ఈ ప్యాకేజీలో లాంచీ ప్రయాణంతోపాటు టీ, స్నాక్స్‌ పర్యాటక శాఖ అందిస్తుంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి