Kartik Purnima 2023: హిందూ సాంప్రదాయంలో కార్తీక పౌర్ణమి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని శుక్లపక్షం పౌర్ణమి రోజున కార్తీక పౌర్ణమిని జరుపుకుంటారు. ఈ సంవత్సరం పౌర్ణమి నవంబర్ 27వ తేదీన వచ్చింది. పురాణాల ప్రకారం ఈరోజు సత్యనారాయణ స్వామిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోవడం వల్ల జీవితంలో సకల శుభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతేకాకుండా ఈ కార్తీక పౌర్ణమి రోజున సాక్షాత్తు శ్రీ మహా విష్ణువే మత్స్యవతారంలో నదిలో కొలువై ఉంటారని భక్తుల నమ్మకం.. కాబట్టి ఈరోజు నది స్నానాల చేసి దానధర్మాలు చేయడం వల్ల ఆర్థిక సమస్యలు జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయట. ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు సర్వార్ధ సిద్ధయోగం, ద్విపుష్కరయోగం ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారు ఊహించని ఫలితాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 


కార్తీక మాసం రోజు మంచి ఫలితాలు పొందబోయే రాశుల వారు మీరే:
వృషభ రాశి:

కార్తీక పౌర్ణమి రోజు జరిగే శుభ యాదృచ్ఛికం వల్ల వృషభ రాశి వారికి శుభ ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో పురోభివృద్ధి లభించడమే కాకుండా ఈ సమయంలో కొత్త ఆదాయ వనరులు పొందే అవకాశాలు లభించబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ వృషభ రాశి వారికి ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ శుభ యాదృచ్ఛికం వల్ల కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొంటుంది.


మిథున రాశి:
కార్తీక పౌర్ణమి రోజు ఏర్పడే సర్వార్ధ సిద్దయోగ ప్రభావం మిధున రాశి వారిపై పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారు ఊహించని లాభాలతో పాటు సంతోషకరమైన సమయాన్ని గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఆర్థిక పరిస్థితుల విషయానికొస్తే కొత్త ఆదాయ వనరులు లభించి ఊహించని లాభాలు పొందుతారు. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్స్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా సంపాద పెరగడం కారణంగా ఆస్తులు కూడా పెరుగుతాయి. ఇక వైవాహిక జీవితం గడుపుతున్న వారికి ఈ యోగం కారణంగా మరింత సంతోషం పెరుగుతుంది.


Also Read: CM Jagan Mohan Reddy: 10,511 జంటలకు రూ.81.64 కోట్ల లబ్ధి.. అకౌంట్‌లోకి డబ్బులు జమ  


కన్యా రాశి:


కార్తీక పౌర్ణమి రోజున ఏర్పడిన శుభ యాదృచ్ఛికం వల్ల కన్యా రాశి వారికి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభించనుంది.  ఈ సమయంలో శ్రీమహావిష్ణువుకి ప్రత్యేక పూజలు చేసి నది స్నానాలు ఆచరించడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారాలు చేస్తున్న వారికి సంపాదన కూడా రెట్టింపు అవుతుంది. దీని కారణంగా కొత్త ఆదాయ వనరులు లభించి వ్యాపారాల్లో పెట్టుబడులు కూడా పెడతారు. అంతేకాకుండా ప్రేమ సంబంధాల్లో మాధుర్యం కూడా పెరుగుతుంది. అర్థిక అవరోధాలు అన్ని తొలగిపోయి కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది. 


తులారాశి:
కార్తీక పౌర్ణమి రోజు ఏర్పడిన సర్వార్ధ సిద్దయోగం కారణంగా తులా రాశి వారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న వారికి ఊహించని ఆదాయ వనరులు పొందుతారు. దీంతోపాటు ఉద్యోగం వ్యాపారాల్లో ఎన్నడూ పొందలేని విజయాలు కూడా సాధించే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు వైవాహిక జీవితం కూడా చాలా ఆనందంగా గడుపుతారు. ఇక వ్యాపారాలు చేస్తున్నవారు ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం చాలా శుభప్రదం.


Also Read: CM Jagan Mohan Reddy: 10,511 జంటలకు రూ.81.64 కోట్ల లబ్ధి.. అకౌంట్‌లోకి డబ్బులు జమ  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook