Kendra Trikon Rajyog 2023: సింహరాశిలో కుజుడు, శుక్రుడు సంచారం చేశాయి. దీని కారణంగా కేంద్ర త్రిభుజం రాజయోగం ఏర్పడుతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ యోగానికి జ్యోతిష్య శాస్త్రంలో గొప్ప ప్రాముఖ్యత ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ యోగం జాతకాల్లో శుభ స్థానంలో ఉంటే చాలా రకాల ప్రయోజనాలు కలుగడమేకాకుండా అదృష్టం కూడా పెరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. త్రిభుజం రాజయోగం జాతకంలో 4, 7, 10 స్థానంలో ఉంటే అదృష్టం పెరగడమే కాకుండా ఊహించని లాభాలు పొందవచ్చు. ఈ యోగమేకాకుండా కొన్ని రాశులవారిపై నవపంచం రాజయోగం ప్రభావం కూడా పడుతుంది. ఈ యోగం ఏర్పడానికి రెండు గ్రహాల మధ్య దూరం 120 డిగ్రీలు ఉండాల్సి ఉంటుంది. అయితే ఈ యోగం కారణంగా ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధనుస్సు రాశి:
ధనుస్సు రాశివారు  సంయమనంతో ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీరు చదువుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే పిల్లలు మంచి ఫలితాలు పొందుతారు. వీరు డబ్బు కోసం కొత్త మార్గాలు వెతకడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా చాలా రకాల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరు ఈ క్రమంలో ఎలాంటి పనులు చేసిన ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఈ క్రమంలో విముక్తి లభిస్తుంది.


Also read: Dark Circles: డార్క్ సర్కిల్స్ మీ అందాన్ని పాడుచేస్తున్నాయా, ఈ చిట్కాలు పాటిస్తే చాలు


సింహ రాశి:
త్రిభుజం రాజయోగం కారణంగా సింహ రాశివారికి కూడా చాలా రకాల లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ యోగం ఉద్యోగాలు చేసేవారికి గొప్ప ప్రయోజనాలను కలిగిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభించడమేకాకుండా చాలా జీతం పెరిగే ఛాన్స్‌ కూడా ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణలు చెబుతున్నారు. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఈ యోగం కారణంగా పెట్టుబడులు పెడితే చాలా రకాల లాభాలు పొందుతారు. 


మేష రాశి:
మేష రాశివారు కూడా ఈ క్రమంలో పలు రకాల ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. నిలిచిపోయిన పనులు చాలా వరకు పూర్తవుతాయి. అంతేకాకుండా ఈ యోగం కారణంగా కష్టపడి పనులు చేయడం వల్ల సులభంగా ఫలితాలు పొందవచ్చు. ఇక వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే ఊహించని లాభాలు పొందుతారు. 


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also read: Dark Circles: డార్క్ సర్కిల్స్ మీ అందాన్ని పాడుచేస్తున్నాయా, ఈ చిట్కాలు పాటిస్తే చాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook