Ketu Transit 2022: తులరాశిలో కేతు గ్రహ సంచారం... రాబోయే 4 నెలలు ఈ రాశులవారికి కష్టకాలం!
Ketu Gochar 2022: ఈ ఏడాది చివరి వరకు కేతు గ్రహం తులరాశిలో ఉంటుంది. దీని సంచారం వల్ల రాబోయే 4 నెలలు ఈ రాశులవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటారు.
Ketu Gochar 2022 Effect: ఆస్ట్రాలజీ ప్రకారం, ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. ఈ రాశిచక్రంలో మార్పు ప్రతి ఒక్కరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. కేతుగ్రహం ప్రస్తుతం తులరాశిలో ఉంది. అక్కడే వచ్చే సంవత్సరం వరకు ఉంటుంది. తులరాశిలో కేతు సంచారం (Ketu Transit in libra 2022) వల్ల మూడు రాశులవారు అనేక సమస్యలు ఎదుర్కోనున్నారు. ఈ ఏడాది చివరినాటికి వీరు అనేక ఇబ్బందులు పడతారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
మీనం (Pisces): తులరాశిలో కేతు సంచారం వల్ల ఈ రాశివారు రాబోయే 4 నెలల్లో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఈసమయం ఎవరికీ అప్పు ఇవ్వకండి. ఎందుకంటే మీరు మోసపోయే అవకాశం ఉంది. ఆఫీసులో ఈ సమయం మీకు కొద్దిగా కష్టంగా ఉంటుంది. అత్యాశకు పోకుండా ఉన్నదానితోనే సంతప్తి చెందేందుకు ప్రయత్నించండి.
మకరం (Capricorn): ఈ ఏడాది చివరి నాటికి కోర్టు సమస్యలను ఎదుర్కోంటారు. ఆస్తిలో పెట్టుబడి పెట్టడం వల్ల మీరు నష్టపోయే అవకాశం ఎక్కువ ఉంది. మీ పట్ల మీ కోలిగ్స్ నెగిటివిటీతో ఉండే అవకాశం ఉంది. కాబట్టి సంయమనంతో వ్యవహారించండి. వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం వల్ల లాస్ అవ్వచ్చు. కాబట్టి ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టడం మానుకోండి.
తుల (Libra): కేతు సంచారం వల్ల ఈ రాశి వారికి ఇంటి గొడవలు ఎదురవుతాయి. ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర కలహాలు పెరిగి ఒకరినొకరు నిందించుకుంటారు. వారి మధ్య ప్రేమ తగ్గిపోయి విడిపోయే పరిస్థితి ఏర్పడవచ్చు. జీవితంలో కొత్తగా ఏదైనా చేయాలనే కోరికను త్యజించండి, లేకపోతే మీరు విఫలమయ్యే అవకాశం ఉంది. ఇంట్లో ఆర్థిక సమస్యలు పెరుగుతాయి.
Also Read: Ganesh Nimajjanam Rules: గణేశ్ నిమజ్జనం ఎప్పుడు , ముహూర్త సమయమేది, చేయకూడని పనులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook