Ketu Transit 2023: అక్టోబరు 30న జరగనున్న అద్భుతం.. ఏడాదిన్నర తర్వాత ఈ రాశుల జీవితాల్లో వెలుగు!
Ketu Gochar 2023: దుష్ట గ్రహమైన కేతువు త్వరలో తులరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో నాలుగు రాశులవారు మంచి ప్రయోజనాలను పొందనున్నారు. ఆ లక్కీ రాశులేవో తెలుసుకుందాం.
Ketu Gochar 2023 Effect: వేద జ్యోతిషశాస్త్రంలో రాహు - కేతువులను ఛాయా గ్రహాలుగా పిలుస్తారు. ఈ రెండు గ్రహాల ఎప్పుడూ తిరోగమనం వైపు కదులుతాయి. ఎవరి జాతకంలో కేతువు అశుభ స్థానంలో ఉంటాడో వారు అనేక సమస్యలను ఎదుర్కోంటారు. కేతు గ్రహం ఏడాదిన్నరకు ఒకసారి రాశిని మారుస్తాడు. అక్టోబరు 30న కేతు గ్రహం కన్యారాశిని వదిలి తులరాశిలోకి ప్రవేశించనున్నాడు. కేతు సంచారం వల్ల నాలుగు రాశులవారు అనేక ప్రయోజనాలు పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
కేతు సంచారం ఈ రాశులకు వరం
వృషభం
తులారాశిలో కేతువు ప్రవేశం వృషభరాశి వారికి కలిసి వస్తుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ మానసిక ఒత్తిడి దూరమవుతుంది. మీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. పార్టనర్ షిప్ తో చేసే పనుల్లో మీకు లాభాలు ఉంటాయి.
సింహరాశి
సింహ రాశి వారికి కేతు సంచారం శుభప్రదంగా ఉంటుంది. మీకు లక్ కలిసి వస్తుంది. కుటుంబంతో సంబంధాలు మెరుగుపడతాయి. మీరు పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోజనం పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది.
Also Read: Mangal gochar 2023: ఎదురెదురుగా రాబోతున్న రెండు పెద్ద గ్రహాలు.. ఈ 4 రాశులకు కష్టాలు షురూ..
ధనుస్సు రాశి
కేతు సంచారం ధనుస్సు రాశి వారి కెరీర్ లో ఎదిగేలా చేస్తుంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీరు ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.
మకరరాశి
కేతు ట్రాన్సిట్ వల్ల మకరరాశి వారు ఆర్థికంగా లాభపడతారు. మీ ధనం పెరుగుతుంది. మీ ఆదాయ వనరులు ఏర్పడతాయి. మీ ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. మీ పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తవుతాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
Also Read: Budh Gochar 2023: జూన్ 24న మిథునరాశిలో 'బుధాదిత్య రాజయోగం'.. ఈ 5 రాశులవారిపై డబ్బు వర్షం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook