Ketu Gochar 2023 effect: జ్యోతిష్య శాస్త్రంలో రాహువు మరియు కేతువులను అశుభ గ్రహాలుగా భావిస్తారు. మీ జాతకంలో రాహు-కేతు గ్రహాలు అశుభ స్థానంలో ఉంటే.. మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కోంటారు. ఛాయా గ్రహమైన కేతువు ఇవాళ అంటే జూన్ 26, సోమవారం సాయంత్రం తన నక్షత్రాన్ని మార్చుకుని చిత్రా నక్షత్రంలోకి ప్రవేశించనుంది. కేతువు యెుక్క నక్షత్ర రాశి మార్పు మూడు రాశులవారికి ఇబ్బందులను కలిగించనుంది. ఈ రోజు నుండి ఏ రాశులవారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ 3 రాశులవారు చాలా జాగ్రత్త
కర్కాటకం: కేతువు యొక్క రాశి మార్పు కర్కాటక రాశి వారికి ఇబ్బందులను కలిగిస్తుంది. మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోవద్దు. మీది లేదా మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది, కాబట్టి ఈ సమయంలో మీరు హెల్త్ ను జాగ్రత్తగా చూసుకోండి. 
మకరం: చిత్రా నక్షత్రంలోకి కేతువు ప్రవేశం మకర రాశి వారికి అశుభ ఫలితాలను ఇస్తుంది. మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీరు కెరీర్ లో చాలా ఇబ్బందులను ఎదుర్కోంటారు. వ్యాపారంలో పెద్దగా లాభాలు ఉండవు. మీరు ఆశించిన ఫలితాలను పొందకపోవడం వల్ల నిరాశకు గురవుతారు. మీ కుటుంబంలో విభేదాలు వస్తాయి. 


Also Read: Lucky Zodiac Sign: శ్రావణ మాసంలో లక్కీ రాశులు ఇవే.. మీది ఉందా?


మీనం: కేతువు యొక్క రాశి మార్పు మీన రాశి వారి కష్టాలను పెంచుతుంది. మీరు యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది, కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం మానుకోండి. మీరు భారీగా డబ్బు నష్టపోతారు. ప్రయాణాలు చేయడం మానుకోండి. మీ లైఫ్ పార్టనర్ తో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. 


Also Read: Rajyog 2023: బుధాదిత్య రాజయోగం ఈ 4 రాశులపై నోట్ల వర్షం.. మీ రాశి ఉందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook