COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Ketu Transit in Virgo 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రస్తుతం కేతువు కన్యారాశిలో ఉన్నాడు అయితే ఇదేరాసులోకి త్వరలోనే బుధుడు కూడా సంచారం చేయబోతున్నాడు దీంతో ఎంతో ప్రత్యేకమైన ప్రభావం ఏర్పడి 12 రాశుల వారికి లాభనష్టాలు కలుగుతాయి. గత సంవత్సరంలో ఈ కేతు గ్రహం కన్యారాశిలోకి సంచారం చేయగా దాదాపు అదే రాశిలో 12 నెలల పాటు సంచార దశలో ఉంటుంది. అయితే బుధుడు కూడా కన్యా రాశికి వెళ్లడం వల్ల కొన్ని రాశుల వారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ రెండు గ్రహాలు శుభస్థానంలో ఉన్న రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. అంతేకాకుండా రాబోయే 12 నెలలు కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో ఏయే రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.


వృశ్చిక రాశి: 
వృశ్చిక రాశి వారికి కేతు ప్రభావం కారణంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో భారీ లాభాలు పొందుతారు. కేతు అనుగ్రహంతో అసంపూర్తిగా ఉన్న పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. అంతేగాకుండా వాటి నుంచి డబ్బులు కూడా వస్తాయి. అయితే ఈ సమయంలో కాస్త ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా డబ్బులను పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా క్షీణించే ఛాన్స్ ఉంది. వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అలాగే ఒత్తిడికి కూడా దూరంగా ఉండడం ఎంతో మంచిది.


మేషరాశి:
మేష రాశివారికి కూడా ఈ సంవత్సరం మొత్తం చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ రాశివారికి కేతువు అనుగ్రహంతో అనుకున్న పనులన్నీ సులభంగా జరిగిపోతాయి. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడే ఛాన్స్‌ ఉంది. ప్రేమ జీవితంలో వస్తున్న అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలంగా ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల అద్భుతమైన లాభాలు పొందుతారు. అంతేకాకుండా కుటుంబంలో ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి కూడా వచ్చే 12 నెలలు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా అనుకున్న పనులన్నీ పూర్తి కావడం వల్ల డబ్బులు కూడా వస్తాయి. అంతేకాకుండా అన్నదమ్ముల మధ్య సంబంధం మరింత మెరుగుపడే ఛాన్స్‌ కూడా ఉంది. అంతేకాకుండా ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి చిన్న చిన్న ట్రిప్స్‌ ప్లాన్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వీరు ఈ సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. 


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకం, వాస్తవాలపై మాత్రమే ఉంటుంది. దీనికి జీ తెలుగు న్యూస్‌ హామీ ఇవ్వదు.)


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి