Ketu Effect On Zodiac Signs:  ఆస్ట్రాలజీలో రాహు, కేతువులను ఛాయా గ్రహాలుగా పిలుస్తారు. సాధారణంగా కేతు సంచారం అశుభ ఫలితాలనే ఇస్తుంది. ప్రస్తుతం కేతువు తులరాశిలో సంచరిస్తున్నాడు. అక్టోబరు 30న కేతువు కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. కన్యా రాశిలో కేతువు తిరోగమనం చేయనున్నాడు. కేతువు వక్రీ కొన్ని రాశులవారికి ప్రయోజనాలను ఇవ్వనుంది. ఆ లక్కీ  రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కన్య రాశి
ఇదే రాశిలో కేతువు తిరోగమనం చేయనున్నాడు. ఈ రాశిచక్రంలోని ఐదవ ఇంట్లో కేతువు సంచరించబోతున్నాడు. దీంతో కన్యా రాశివారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు మానసిక ఒత్తిడి నుండి బయటపడతారు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ప్రేమ లేదా వైవాహిక జీవితం బాగుంటుంది. కేతు రాశి మార్పు వల్ల మీరు మంచి ప్రయోజనాలు పొందుతారు. 
సింహరాశి 
సింహరాశి వారికి కేతువు తిరోగమనం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అక్టోబర్ 30 తర్వాత ఈ రాశి వారు మంచి లాభాలను పొందతారు. ఎందుకంటే కేతు గ్రహం మీ రాశిచక్రంలోని రెండో ఇంట్లో సంచరిస్తున్నాడు. ఆర్థిక కష్టాల నుండి బయటపడతారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. 


Also read: Sawan Zodiac Signs: రాబోయే రెండు నెలలు ఈ 4 రాశులకు నరకమే.. మీ రాశి ఉందా?


ధనుస్సు రాశి
కన్యారాశిలో కేతువు వ్యతిరేక కదలిక ధనుస్సు రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. మీ దశమ స్థానంలో కేతువు సంచరించనున్నాడు. దీని కారణంగా మీరు వ్యాపారం మరియు కెరీర్ లో విజయాన్ని సాధిస్తారు. మీరు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఉద్యోగులకు ఈ సమయం బాగుంటుంది. మీ ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. మీరు ఊహించని ధనలాభాన్ని పొందుతారు. 


(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also read: Guru Gochar 2023: ఈ 3 రాశులపై గురుడు శుభ దృష్టి.. వీరికి డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి