Kharmas 2022 December: సనాతన ధర్మంలో కేవలం శుభ సమయంలో మాత్రమే శుభకార్యాలు జరుపుకోవాలని పేర్కొన్నారు. సూర్య గ్రహం సంచారం వల్ల శుభ సమయాలు శుభ ఘడియలు ఏర్పడతాయని శాస్త్రంలో వివరించిన సంగతి అందరికీ తెలిసిందే.. అయితే సూర్య గ్రహ సంచారం వల్ల 12 రాశుల వారికి ప్రయోజనాలు చేకూరుతాయి. ప్రస్తుతం మీన రాశిలో ఉన్న సూర్యగ్రహం డిసెంబర్ 16న ధనస్సు రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీంతో ఖర్మ సమయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ  ఖర్మ సమయంలో తప్పకుండా అన్ని రాశుల వారు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర దుష్ప్రభావాలు కలిగే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎందుకు ఈ క్రమంలో శుభకార్యాలు జరుపుకోవద్దో తెలుసా..?:
సూర్యుడు బృహస్పతి రాశిలోకి సంచారం చేయడం వల్ల బలహీనంగా మారబోతున్నాడు. దీంతో శుభ ఘడియలు అన్ని తొలగిపోయి.. అందుకే ఈ  ఖర్మ సమయంలో ఎలాంటి శుభకార్యాలు జరగవు. డిసెంబర్ 16 నుండి జనవరి 14 వరకు సూర్యుడు ధనుస్సు రాశిలో సంచారం చేయడం వల్ల పలు మార్పులు రాబోతున్నాయి.  ఖర్మ సమయాల్లో కూడా ఈ మార్పులు సంభవించబోతున్నాయని జ్యోతిష్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 


 ఖర్మ సమయం:
డిసెంబరు 16 నుండి కర్మల తేదీ ప్రారంభమై జనవరి 14 వరకు కొనసాగుతుంది. జనవరి 14 న సూర్యుడు మకరరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీంతో ఆ రోజు నుంచి ఎలాంటి శుభకార్యాలైన జరుపుకోవచ్చు. 


ఖర్మలలో ఏమి చేయకూడదు.?:
1.  ఖర్మ సమయంలో వివాహాలు జరుపుకోవడం నిషిద్ధం.
2. ఈ క్రమంలో ఇంటి నిర్మాణాలు చేయడం మంచిది కాదు.
3.  ఖర్మ సమయంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించడం వల్ల తీవ్ర నష్టాల పాలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
4. చాలాకాలం పాటు పెండింగ్ లో ఉన్న పనులు ఈ  ఖర్మ సమయంలో చేయడం చాలా నిషిద్ధం. 


Also Read: Minister KTR: సింగరేణి ఉసురు తీసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు.. కేంద్ర ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్  


Also Read: Minister KTR: సింగరేణి ఉసురు తీసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు.. కేంద్ర ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి