Kitchen Vastu Tips: హిందూమతంలో రాహుకేతువులు అన్నింటి కంటే ఆగ్రహం కలిగిన గ్రహాలుగా భావిస్తారు. అందుకే రాహుకేతువులపై జాగ్రత్తగా ఉంటారు. ఈ రెండు ఏ మాత్రం కోపంగా ఉన్నా..ఆ కుటుంబం నుంచి సుఖసంతోషాలు దూరమైపోతాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యం ప్రకారం రాహుకేతు గ్రహాలకు కోపం ఎక్కువ. అందుకే చాలామంది రాహుకేతువులనగానే భయపడిపోతుంటారు. ఈ రెండు గ్రహాలు ఏ మాత్రం సంతోషంగా లేకపోయినా..అంటే ప్రసన్నితం కాకపోతే..ఆ వ్యక్తి  జీవితం సమూలంగా నాశనమైపోతుందంటారు. అందుకే ఈ రెండు గ్రహాల్ని శాంతింపజేయడం చాలా అవసరమని జ్యోతిష్యశాస్త్రంలో ఉంది. ఈ నేపధ్యంలో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలి. వంటింట్లో ఉండే రెండు పాత్రలు నేరుగా రాహుకేతువులతో సంబంధం కలిగి ఉంటాయని మీకు తెలుసా..ఆ రెండు పాత్రలకు సంబంధించిన నియమాల్ని పాటించకపోతే..కుటుంబపై విపత్తు రావచ్చంటున్నారు. అందుకే ఆ రెండు పాత్రలేవి, ఆ నియమాలేంటో తెలుసుకోవల్సిన అవసరముంది.


వాస్తుశాస్త్రం ప్రకారం రాహు కేతువులతో సంబంధమున్న వంటింట్లోని పాత్రలు రెండు. ఒకటి పెనం కాగా రెండవది కడాయి. కడాయి లేదా పెనం వేడిగా ఉన్నప్పుడు వాటిపై నీళ్లు చిమ్మకూడదని హిందూ మతగ్రంధాల్లో ఉంది. ఇలా చేయడం వల్ల ఆ కుటుంబంపై పెను విపత్తు విరుచుకుపడవచ్చు. ఈ రెండు వస్తువులు చల్లారితే..కిందకు దించి శుభ్రం చేసిన తరువాత తిరిగి యధాస్థానంలో ఉంచాలి. ఈ రెండు వస్తువుల్ని పొయ్యిపై పెట్టి ఉంచితే ఆ ఇంట్లో నెగెటివ్ శక్తి ప్రసరితమౌతుంది. 


జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వంటింట్లో పెనంను బయటివాళ్ల దృష్టి సాధారణంగా పడనిచోట పెట్టాలి. మరోవైపు కడాయి, పెనంను ఎట్టి పరిస్థితుల్లోనూ తిరగేసి ఉంచకూడదు. అలా చేయడం వల్ల ఇంట్లో రాహువు నెగెటివ్ శక్తి ప్రసరితమౌతుంది. కుటుంబ ఆర్ధిక ప్రగతి నిలిచిపోతుంది. 


వాస్తుశాస్త్రం ప్రకారం వంటింట్లో పెనం, కడాయిని ఎప్పుడూ కుడివైపునే ఉంచాల్సి ఉంటుంది. ఎందుకంటే కుడివైపు స్థానం ఎప్పుడూ అన్నపూర్ణ దేవికి ఆవాసంగా భావిస్తారు. అందుకే అదే దిశలో ఈ రెండు వస్తువుల్ని ఉంచాలి. మతగ్రంధాల ప్రకారం అన్నం వండిన తరువాత కడాయి, పెనంలో కొద్దిగా ఉప్పు చల్లి ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగెటివ్ శక్తులు ప్రసరించకుండా ఉంటాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. 


Also read: Jupiter in Pisces Effect: గురుడి మీనరాశి ప్రవేశం, ఆ మూడు రాశులకు మరో మూడు నెలల వరకూ ఊహించని డబ్బు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Apple Linkhttps://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook