Surya Grahan 2023 Date & Details: సూర్య, చంద్ర గ్రహణాలను ఖగోళ దృగ్విషయాలుగా పేర్కొంటారు. ఈ సంవత్సరం రెండు సూర్య, రెండు చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. ఇప్పటికే ఒక సూర్యగ్రహణం మరియు ఒక చంద్ర గ్రహణం సంభవించాయి. రెండవ లేదా చివర సూర్యగ్రహణం అక్టోబర్ 14న ఏర్పడబోతుంది. ఇప్పుడు సంభవించబోయేది కంకణాకృత సూర్యగ్రహణణం. ఇది అశ్వినీ మాసంలోని అమావాస్య రోజున జరగబోతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్రహణ సమయం
రెండో సూర్యగ్రహణం శని అమావాస్య నాడు ఏర్పడబోతుంది. ఇది అక్టోబరు 14 14 రాత్రి 08:34 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 02:25 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణం కన్యారాశి మరియు చిత్ర నక్షత్రాలలో రూపొందుతుంది. 


గ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది?
ఈ సూర్యగ్రహణం బ్రెజిల్, పరాగ్వే, జమైకా, హైతీ, అమెరికా, చిలీ, డొమినికా, బహామాస్, కెనడా, అర్జెంటీనా, కొలంబియా, మెక్సికో, క్యూబా, బార్బడోస్, ఆంటిగ్వా తదితర దేశాల్లో కనిపించనుంది. ఈ ఏడాది రెండవ మరియు చివరి సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు, కాబట్టి దాని సూతక్ కాలం కూడా చెల్లదు. సూర్యగ్రహణం యొక్క సూతక్ కాలం గ్రహణానికి 12 గంటల ముందు ప్రారంభమవుతుంది. ఈ సమయంలో పూజలు, శుభకార్యాలు చేయడం నిషేధం.


కంకణాకృతి సూర్యగ్రహణం అంటే..
సూర్యుని మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు..గ్రహణం సమయంలో ఒక రింగ్ ఏర్పడుతుంది. దీనినే కంకణాకృతి సూర్యగ్రహణం అంటారు.


Also Read: Rajyoga: 'భద్ర మహాపురుష రాజయోగం' చేయబోతున్న బుధుడు.. ఈ 3 రాశులకు లాభాలు బోలెడు..


ఈ రాశులపై చెడు ప్రభావం
కన్యారాశిలో ఏర్పడబోయే ఈ సూర్యగ్రహణం మేషం, కర్కాటకం, తులారాశి మరియు మకరరాశి వారిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ రాశుల వారు గ్రహణ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే ప్రయాణాలకు దూరంగా ఉండాలి.


Also Read: Mangal Gochar 2023: నెల రోజులపాటు ఈ 3 రాశులవారికి అదృష్టం, ఐశ్వర్యం..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook