Mars Transit 2023 in Cancer: కర్కాటకంలో అంగారకుడి సంచారం.. ఏర్పడిన 'నీచభంగ్ రాజయోగం'.. ఈ రాశులకు అదృష్టం, ఐశ్వర్యం

Mangal Gochar 2023: ధైర్యాన్ని ఇచ్చే అంగారకుడు ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. కుజుడి సంచారం వల్ల మూడు రాశులవారు ఊహించని ప్రయోజనాలను పొందనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 4, 2023, 11:43 AM IST
Mars Transit 2023 in Cancer: కర్కాటకంలో అంగారకుడి సంచారం.. ఏర్పడిన 'నీచభంగ్ రాజయోగం'.. ఈ రాశులకు అదృష్టం, ఐశ్వర్యం

Mars Transit 2023: ఆస్ట్రాలజీలో అంగారకుడిని ధైర్యం, శౌర్యం మరియు వివాహానికి కారకుడిగా భావిస్తారు. కుజుడు గమనంలో చిన్న మార్పు కూడా ప్రజల జీవితాలపై పెను ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం మార్స్ కర్కాటక రాశిలో సంచరిస్తుంది. కుజ గ్రహం జూలై 01 వరకు అదే రాశిలో సంచరిస్తుంది. కర్కాటక రాశిలో అంగారకుడు బలహీనమైన స్థితిలో ఉంటాడు. ఇతడి సంచారం కారణంగా నీచభంగ్ రాజయోగం ఏర్పడుతుంది. కర్కాటకంలో అంగారకుడి సంచారం వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

మేషం: కుజుడి సంచారం మేషరాశి వారికి మేలు చేస్తుంది. వీరు పూర్వీకుల ఆస్తి ద్వారా ప్రయోజనం పొందుతారు. మేష రాశి వారు ఏదైనా కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభాలను ఆర్జిస్తారు. మీకు ప్రతి పనిలో విజయం లభిస్తుంది. ఆగిపోయిన పనులన్నీ మెుదలవుతాయి. 

కర్కాటక రాశి: ఇదే రాశిలో అంగారకుడు సంచరిస్తున్నాడు. దీని కారణంగా వీరి ఆదాయం రెట్టింపు అవుతుంది. మీ ఆర్థిక పరిస్థి బలపడుతుంది. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. కర్కాటకరాశికి చెందిన వ్యక్తులు సంతానాన్ని పొందే అవకాశం ఉంది. డబ్బును ఆదా చేస్తారు.

Also Read: Rahu Gochar 2023: వచ్చే 153 రోజులపాటు ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.. మీరున్నారా?

తుల: మార్స్ తులారాశి వారికి మేలు చేస్తుంది. వీరికి చాలా లాభాలను ఇస్తాడు. మీరు కెరీర్లో అద్భుతమైన పురోగతి సాధిస్తారు. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది. వ్యాపారులు లాభపడతారు. ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. మీరు కోరుకున్న చోటుకి ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉంది. 

Also Read: Budh Surya Yuti 2023: బుధాదిత్య రాజయోగంతో ఈ 3 రాశులకు మహార్దశ... మీ రాశి ఉందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News