Zodiac Sign: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం ఏదో ఒక సమయంలో రాశి సంచారం చేస్తుంది. ఇలా సంచారం చేయడం కారణంగా మొత్తం 12 రాశుల వారి జీవితాలపై పడుతుంది. గ్రహ సంచారాల కారణంగా శుభ అశుభ ప్రభావాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఈ ప్రభావాలనేవి వ్యక్తుల జీవితాలపై పడడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి. జాతకంలో గ్రహాలు అనుకూల స్థానంలో ఉంటే.. వ్యక్తుల జీవితాలపై సానుకూల ప్రభావం పడుతుంది.. అదే గ్రహం ప్రతికూల స్థానంలో ఉంటే జీవితంలో సమస్యలు తప్పవని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సంవత్సరంలోని చంద్ర గ్రహం తన మొదటి సంచారం చేయబోతోంది. బృహస్పతి గ్రహం ప్రస్తుతం మేషరాశిలో ఉంది. అయితే ఈ రెండు గ్రహాలు కలవబోతున్నాయి. కలయిక కారణంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన గజకేసరి యోగం ఏర్పడబోతోంది. ఈ యోగం కారణంగా మూడు రాశుల వారికి స్వర్ణ యుగం ప్రారంభం అవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశుల వారు ఊహించని లాభాలు పొందుతారు:
మేష రాశి:

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి చంద్ర గ్రహాలు కలయిక కారణంగా మేష రాశి వారికి ఎన్నో లాభాలు కలుగుతాయి. ఈ సంయోగంతో ఏర్పడే గజకేసరి యోగం కారణంగా వీరిపై వీరికి మరింత విశ్వాసం పెరుగుతుంది. దీని కారణంగా మంచి పనులు చేసి సమాజంలో గౌరవం పొందుతారు. అంతేకాకుండా కీర్తి ప్రతిష్టలు కూడా లభిస్తాయి. అలాగే ఈ సమయంలో భౌతిక ఆనందంతో పాటు కెరీర్‌లో మెరుగుపడే అనేక రకాల ప్రణాళికలను పొందుతారు. జీవిత భాగస్వామి మధ్య సంబంధం కూడా మెరుగుపడుతుంది.


మకర రాశి:
మకర రాశి వారికి ఈ రెండు గ్రహాల సంయోగం కారణంగా ఏర్పడే గజకేసరి యోగం ఎంతో ప్రయోజనకరంగా ఉండబోతోంది. దీని కారణంగా వీరు కొత్త కార్లు లేదా ఆస్తులను కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. దీంతో పాటు వీరు ఆకస్మిక ధన లాభాలు కూడా పొందుతారు ఉద్యోగం చేసేవారు ఊహించని శుభవార్తలు వింటారు. దీంతో పాటు కెరీర్ లో అనేక మార్గాలు లభిస్తాయి. దీంతోపాటు అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.


Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..


మీన రాశి:
ఈ గజకేసరి యోగం కారణంగా మీన రాశి వారికి శుభకరమైన రోజులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమయంలో ఊహించని డబ్బుతో పాటు అనేక ఆర్థిక లాభాలు పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారికి ఈ యోగం చాలా కలిసి వస్తుంది. ఈ సమయంలో కార్యాలయాల్లో ప్రశంసలు కూడా పొందుతారు. భౌతిక ఆనందం కూడా ఇంతకుముందున్న దానికంటే ఇప్పుడు మెరుగుపడుతుంది. ఈ సమయంలో ఎలాంటి ప్రణాళికను రచించిన విజయాలు మీ సొంతం.


Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter