Mercury Venus Transit December 2022: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ప్రతి గ్రహం నిర్దిష్ట సమయంలో ఇతర రాశిలోకి సంచారం చేస్తూ ఉంటుంది. ఇలా సంచారాలు చేయడం వల్ల అన్ని రాశుల వారిలో తీవ్ర మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా బుధ, శుక్ర గ్రహాలు సంచారం చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఈ నెల మూడో వారంలో చాలా గ్రహాలు ఇతర రాశిలోకి సంచారం చేయబోతున్నాయి. ఈ సంచార కారణంగా లక్ష్మీనారాయణ యోగం ఏర్పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా డిసెంబర్ 28న బుధుడు మకర రాశిలోకి సంచారం చేయడం కారణంగా అదే రాశిలోకి శుక్రుడు కూడా సంచారం చేస్తున్నాడు. ఈ సంచారాల ప్రభావం మూడు రాశుల వారిపై తీవ్రంగా పడబోతోంది. దీంతో లక్ష్మీనారాయణ మహాయోగం ఆ రాశుల వారికి కలిగే అవకాశాలున్నాయి. కాబట్టి ఆ రాశుల వారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు మనం ఇప్పుడు తెలుసుకుందాం..


లక్ష్మీ నారాయణ యోగం వల్ల లాభాలు పొందబోయే రాశుల వారు వీరే:


మకర:
బుధ-శుక్ర సంచారం కారణంగా ఏర్పడే లక్ష్మీనారాయణ యోగం మకర రాశి వారికి శుభప్రదంగా మారబోతోంది. ఈ రాశి వారు ఊహించని అదృష్టాన్ని పొందబోతున్నారు. ఈ సంచార ప్రభావం వల్ల పోటీ పరీక్షల్లో ఇంటర్వ్యూలలో విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలు పొందుతారు.


ధనుస్సు: 
ఈ సంచారాల కారణంగా ఏర్పడే లక్ష్మీనారాయణ యోగం ధనస్సు రాశి వారికి కూడా చాలా రకాల ప్రయోజనాలను తెచ్చిపెడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థికంగా నష్టపోయిన వారు ఈ క్రమంలో లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని లాభాలు పొందే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ క్రమంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నించడం చాలా మంచిది.


మీనం: 
యోగం వల్ల మీన రాశి వారు కూడా మంచి ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా ఈ క్రమంలో లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. దీంతో ఈ రాశి వారు ఊహించని లాభాలు పొందడమే కాకుండా వ్యాపారాల్లో అంచలంచలుగా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశుల వారు ఆర్థిక విషయాల్లో తప్పకుండా పలురకాల జాగ్రత్తలు పాటించాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.


Also Read : Ram Charan Video Call : గుడ్ న్యూస్ చెప్పబోతోన్న ప్రభాస్!.. లీక్ చేసిన రామ్ చరణ్‌


Also Read : Anasuya Bharadwaj White Dress : బొడ్డు చూపిస్తున్న జబర్దస్త్ బ్యూటీ.. తెలుపు దుస్తుల్లో అనసూయ అందాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook