Lakshmi Narayana Yogam Effect: కన్యారాశిలో లక్ష్మీ నారాయణ యోగం... అంతులేని సంపద ఈ రాశుల సొంతం..
September Horoscope : సెప్టెంబరు నెలలో శుక్రుడు సింహరాశిలో ఆస్తమించి... కన్యారాశిలో సంచరించనున్నాడు. దీంతో కన్యారాశిలో బుధ-శుక్రుల కలయిక వల్ల లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశులవారికి అపారమైన ప్రయోజనాలను ఇస్తుంది. .
Shukra Gochar make Budh Shukra Yuti: ఈ నెలలో శుక్రుడు సింహరాశిలో ఆస్తమించనున్నాడు. దీని తర్వాత కన్యారాశిలో సంచరిస్తాడు. కన్యా రాశిలో అప్పటికే బుధుడు తిరోగమనంలో ఉంటాడు. ఈ రాశిలోనే బుధ, శుక్ర గ్రహాల కలయిక (Budh Shukra Yuti 2022) వల్ల లక్ష్మీనారాయణ యోగం (Lakshmi Narayana Yogam) ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. వీరు కెరీర్ లో పురోగతి, అపారమైన ధనాన్ని పొందుతారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
మేష రాశి(Aries): సెప్టెంబర్ నెలలో ఏర్పడే లక్ష్మీ నారాయణ యోగం మేషరాశి వారిని బాగా కలిసివస్తుంది. వ్యాపారులు భారీగా లాభాలను ఆర్జిస్తారు. కొత్త జాబ్ రావచ్చు. వివాహానికి ఆటంకాలు తొలగిపోతాయి. స్నేహితుల సహకారంతో ఏదైనా ముఖ్యమైన పని పూర్తి చేస్తారు.
మిథున రాశి (Gemini): లక్ష్మీ నారాయణ యోగం మిథున రాశి వారికి చాలా మేలు చేస్తుంది. ఆగిపోయిన పని పూర్తవుతుంది. ఉద్యోగాలు చేసే వారు లాభపడతారు. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు లాభాలు పెరుగుతాయి. పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది.
కర్కాటక రాశి (Cancer): కర్కాటక రాశి వారికి బుధ-శుక్రుల కలయిక వల్ల ఏర్పడే లక్ష్మీనారాయణ యోగం వారి కెరీర్‌కు ఊపునిస్తుంది. సహోద్యోగులు సహాయం చేస్తారు. డబ్బు లాభదాయకంగా ఉంటుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఇప్పుడు పెట్టిన పెట్టుబడి భవిష్యత్తులో లాభాలను తెస్తుంది.
కన్య రాశి (Virgo): కన్యా రాశి వారికి సెప్టెంబర్ నెల చాలా లాభాలను ఇస్తుంది. లక్ కలిసి వస్తుంది. పెరుగుతుంది. భూమి-ఆస్తి ద్వారా లాభం ఉంటుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మీరు అప్పుల నుండి ఉపశమనం పొందుతారు. మొత్తం మీద మీరు సంతోషంగా మరియు రిలాక్స్‌గా ఉంటారు.
ధనుస్సు రాశి (Sagittarius): సెప్టెంబర్ ప్రారంభం నుండి ధనుస్సు రాశి వారికి ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీ పనులు ప్రశంసించబడతాయి. మీరు ఆఫీసులో గౌరవించబడతారు. ఉద్యోగం మారాలనే మీ కోరిక నెరవేరుతుంది.
Also Read: కలలో ఈ పువ్వును చూసినట్లయితే... మీకు లక్కే లక్కు, ఇక మీపై డబ్బు వర్షమే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook