Chandra Grahan 2023: చంద్రగ్రహణం తేది, ప్రత్యేక సమయాలు, సూతక కాలం నియమాలు..
Last Chandra Grahan 2023 Date and Time: చంద్రగ్రహణం కారణంగా కొన్ని రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే సూతక కాల సమయంలో తప్పకుండా గర్భిణీ స్త్రీలు పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలి.
Last Chandra Grahan 2023 Date and Time: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరంలో అక్టోబర్ నెల చాలా ప్రాముఖ్యమైనదిగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ నెలలోనే చాలా రాశులు సంచారం చేయడంతో పాటు ఈ సంవత్సరం చివరి చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతోంది. కాబట్టి కొన్ని రాశులవారిపై ఈ గ్రహ సంచారాల ప్రభావంతో పాటు, గ్రహణ ప్రభావం కూడా పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ గ్రహణ ప్రభావం భారత్‌పై ఎంత వరకు ప్రభావం చూపుతుందో..సూతకాలం ఎప్పుడు ఏర్పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
చంద్రగ్రహణం ఎప్పుడు సంభవిస్తుందంటే:
ఈ సంవత్సరంలో రెండవ, చివరి చంద్రగ్రహణం అక్టోబర్ 28 అర్ధరాత్రి సంభవిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుతున్నారు. ఖగోళ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..అక్టోబర్ 29 ఉదయం 01:05 గంటలకు ప్రారంభమై.. 02:24 గంటలకు ముగుస్తుందన్నారు.
ఈ దేశాలలో చంద్రగ్రహణం కనిపిస్తుంది:
ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కాకుంగా యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, తూర్పు, దక్షిణ అమెరికా, హిందూ మహాసముద్రం, అంటార్కిటికాలో కనిపిస్తుంది. అంతేకాకుండా అట్లాంటిక్ మహాసముద్ర ప్రాంతాల్లో కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయి.
చంద్రగ్రహణం సూతక కాల సమయం:
చంద్రగ్రహణం సూతక కాలం 09 గంటల ముందే ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే భారత్‌లో ఈ చివరి చంద్రగ్రహణం దృశ్యమానత కారణంగా సూతక కాలం అక్టోబర్ 28 సాయంత్రం 04:05 నుంచి చెల్లుబాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
ఈ గ్రహణం ఏయే రాశులను ప్రభావం చూపుతుందంటే:
ఈ సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం మేషం, అశ్విని నక్షత్రాలలో సంభవించబోతోంది. దీని కారణంగా మేషం, వృషభం, కన్య, మకర రాశుల వారు గ్రహణ కాలంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ గ్రహణం కారణంగా మిథున, కర్కాటక, వృశ్చిక, కుంభ రాశుల వారు మంచి ఫలితాలు పొందుతారు.
చంద్రగ్రహణంలో సూతక కాలం నియమాలు:
గర్భిణీ స్త్రీలు గ్రహణ సూతకాల సమయంలో తప్పకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే పుట్టబోయే బిడ్డపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
గర్భిణీ స్త్రీలు పదునైన వస్తువుల ముట్టుకోకపోవడం చాలా మంచిది.
సూతకాల సమయంలో పాలు, పెరుగు, నీరు తాగకపోవడం చాలా మంచిది.
ఈ సమయంలో దేవుడి విగ్రహాలను పూజించడం మానుకోవాలి.
గ్రహణ సమయంలో ఎలాంటి శుభ కార్యాలు జరుపుకోవద్దు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..