Last Karthika Somavaram: చివరి కార్తీక సోమవారం నేడే... శైవక్షేత్రాలకు పోటెత్తుతున్న భక్తులు...
Karthika Somavaaram: నేడే చివరి కార్తీక సోమవారం. దీంతో ప్రముఖ శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని శ్రీశైల క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది.
Last Karthika Somavaram: ఇవాళ చివరి కార్తీక సోమవారం. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలకు (Shiva temples) భక్తులు పోటెత్తుతున్నారు. ముఖ్యుంగా ఏపీలోని శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఉదయాన్నే నదీ స్నానమాచరించి కార్తీక దీపాలను వెలిగించి నీటిలో వదులుతున్నారు.
కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో... ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో భక్తుల రద్దీ నెలకొంది. పాతాళగంగలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి.. మల్లన్న దర్శనం చేసుకుంటున్నారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా స్వామివారి గర్భాలయ స్పర్శ దర్శనాలను రద్దు చేశారు. భక్తులందరికీ స్వామివారి దర్శనం చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. పంచారామ క్షేత్రాలైన ద్రాక్షారామం, కుమారారామం, క్షీరారామం, భీమారామం, అమరారామం దేవాలయాల్లో కూడా భక్తుల సందడి నెలకొంది. శ్రీకాళహస్తి, కపిలతీర్థం, త్రిపురాంతకం, బైరవకోన వంటి పుణ్యక్షేత్రాలు కూడా శివనామస్మరణతో మార్మోగుతున్నాయి.
తెలంగాణలో ప్రముఖ ఆలయాలన్నీ భక్తులతో కళకళ్లాడుతున్నాయి. ముఖ్యంగా యాదగిరి గుట్ట, కాళేశ్వర ముక్తేశ్వర స్వామి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ ఆలయాల్లో భక్తులు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. నిన్న కార్తీక మాసం చివరి ఆదివారం కావడంతో పిక్నిక్ స్పాట్స్ కు ప్రజలు పోటెత్తారు. బీచ్లు, ఆలయాలు, ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఎక్కడ చూసిన జనసందోహమే కనిపించింది.
Also Read: Kaala Bhairava: శత్రువులను జయించేందుకు కాలభైరవ పూజ చేయండి.. శనివారం పూజ చేస్తే విజయం మీదే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook