Friday Remedies: శుక్రవారం ఈ వస్తువులను దానం చేస్తే.. డబ్బు వర్షం కురుస్తుంది, శుక్ర దోషం తొలగిపోతుంది...
Friday Remedies: లక్ష్మీ దేవి అనుగ్రహం పొందడానికి జ్యోతిష్య శాస్త్రంలో అనేక పరిహారాలు చెప్పబడ్డాయి. అందులో ఒక పద్దతి దానం చేయడం.
Friday Remedies: శుక్రవారం సంపదలకు అదిదేవత అయిన లక్ష్మీదేవిని (Goddess Laxmi) పూజిస్తారు. అంతేకాకుండా మీ జాతకంలోని శుక్ర దోషం తొలగిపోవాలంటే.. శుక్రవారం నాడు వీటిని దానం చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే బిచ్చగాడి కూడా బిలియనీర్ అవుతాడు. లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి ఆస్ట్రాలజీలో కొన్ని చిట్కాలు చెప్పబడ్డాయి. అవేంటో తెలుసుకుందాం.
ఈ వస్తువులను దానం చేయడం శుభప్రదం
ఖీర్- మీ ఇంట్లో దేనికి లోటు లేకుండా ఉండాలంటే.. శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఖీర్ ను నైవేద్యంగా పెట్టండి. అనంతరం దానిని పేదలకు పంచండి.
పదహారు వస్తువులు- లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి శుక్రవారం చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజున వివాహిత స్త్రీలు తమ చేతులతో ఎర్రటి గాజులు, కుంకుమ, ఎర్ర చీర, ఎర్రటి బిందీ, మెహందీ మొదలైన పదహారు వస్తువులను దానం చేస్తే.. వైవాహిక జీవితంలో సమస్యలన్నీ తొలగిపోతాయి.
తెల్లని వస్తువుల దానం- లక్ష్మీదేవికి తెల్లని వస్తువులు అంటే చాలా ఇష్టం. అందుకే పూజలో తెలుపు రంగు వస్తువులనే ఎక్కువగా వాడాలి. శుక్రవారం ఈ వస్తువులను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజు అన్నం, పంచదార, పాలు, ఖీర్, పెరుగు, వెండి, తెల్ల చందనం మొదలైన వాటిని దానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించడంతోపాటు శుక్రదోషం నుండి విముక్తి లభిస్తుంది.
వస్త్రదానం- శుక్రవారం నాడు వస్త్రదానం చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలై కోరిన కోర్కెలు తీరుస్తుంది. మహిళలు తమ దగ్గరి బంధువులకు పట్టు వస్త్రాలను దానం చేయడం వల్ల ఇంట్లో శాంతి, సంతోషాలు నెలకొంటాయి. అలాగే వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది.
ఉప్పు దానం - శుక్రవారం ఉప్పును దానం చేయడం వల్ల శుక్ర గ్రహ దోషం తొలగిపోతుంది.
Also Read: Vishwakarma Puja 2022: రేపే దేవశిల్పి విశ్వకర్మ జయంతి.. ప్రాముఖ్యత, పూజ విధానం తెలుసుకోండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook