Lucky Women: మహిళల శరీరంపై ఆ గుర్తులుంటే..అదృష్టవంతులట. అంతేకాదు సౌభాగ్యవతులని నమ్మకం. దూరం నుంచి చూసే ఆ మహిళల్ని గుర్తు పట్టవచ్చంటున్నారు. ఆ వివరాలు చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పుట్టుకతోనే అదృష్టవంతులవడం చిన్న విషయమేం కాదు. ప్రతి ఒక్కరికి అది సాధ్యం కాదు. ఈ అదృష్టవంతులు తమ జీవితంలో అన్ని సుఖాలు అనుభవించడమే కాకుండా..ఇతరులకు కూడా అదృష్టవంతులుగా మారతారు. సౌభాగ్యశీలి, ఎడ్యుకేటెడ్, సంస్కారవంతమైన మహిళ కేవలం తన విషయంలోనే కాకుండా..తన కుటుంబసభ్యుల అదృష్టం, జీవితాల్ని మార్చివేయగలదు. తండ్రితో ఉన్నా..భర్తతో ఉన్నా సరే..ప్రతిచోటూ ప్రేమ, గౌరవాల్ని పొందుతుంది. ఇటువంటి మహిళలు, లేదా అమ్మాయిల్ని ఎలా గుర్తు పట్టాలో తెలుసుకుందాం. సముద్ర శాస్త్రంలో ఇలాంటి అదృష్టవంతులైన మహిళల్ని గుర్తించేందుకు సులభమైన పద్ధతులున్నాయి.


సముద్రశాస్త్రం ప్రకారం అదృష్టవంతులైన మహిళలు లేదా అమ్మాయిల గుర్తింపు వారి కాలి అడుగుభాగంతో చేయవచ్చు. ఎవరి కాళ్లైతే అతి సున్నితంగా, లలితంగా ఉంటాయో వాళ్లు లక్ష్మీ స్వరూపులు. ఇలాంటి మహిళలుండే ఇంట్లో..డబ్బుల వర్షం కురుస్తుంది. అంతేకాకుండా మహిళ కాలి అడుగుభాగాన శంఖం, కమలం లేదా చక్రం వంటి గుర్తులుంటే..ఉన్నత స్థానంలో ఉంటారని అర్ధం. 


ముక్కుపై మచ్చ ఉన్న మహిళ లేదా అమ్మాయి అత్యంత అదృష్టవంతురాలని అర్ధం. ఇలాంటి మహిళ జీవితంలో సుఖం సమృద్ధిగా ఉంటుంది. ఏ మహిళ బొడ్డు సమీపంలో మచ్చ లేదా పుట్టుమచ్చ ఉంటుందో..ఆ కుటుంబం అదృష్టం మెరిసిపోతుంది. ఇలాంటి మహిళల కుటుంబం వైభవంగా, గౌరవంగా ఉంటుంది. 


ఏ మహిళ కళ్లు లేడిలా అందంగా ఉంటాయో వారు తమ కుటుంబానికి అదృష్టవంతులుగా ఉంటారు. ఇలాంటి కుటుంబంలో వ్యక్తులు ఎప్పుడూ ప్రేమ, ఆనందంతో ఉంటారు. ఒకవేళ లేడి కళ్లతో పాటు..కంటి చివరి భాగం ఎర్రగా ఉంటే ఆ కుటుంబంలో సంపదే సంపద వచ్చి పడుతుందట.


Also read: Rahu venus conjuction : రాహువు-శుక్ర కలయిక ఎఫెక్ట్.. జూన్ 14 తర్వాత 12 రాశుల వారి జీవితంలో ఏం జరగబోతుందంటే..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook