COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

October 2024 First Week Lucky Zodiac Sign: రాశి సంచారాలపరంగా అక్టోబర్ నెలలోని మొదటివారం ఎంతో శుభప్రదమైందిగా భావించవచ్చు. ఎందుకంటే ఈ సమయంలోనే సూర్యగ్రహంతోపాటు బుధ గ్రహం కూడా సంచారం చేయబోతున్నాయి. దీనికి కారణంగా ఎంతో శక్తివంతమైన బుధాదిత్య రాజయోగంతో పాటు కొన్ని ప్రత్యేకమైన యోగాలు ఏర్పడబోతున్నాయి. అయితే ఈ రాజయోగాన్ని జ్యోతిష్య శాస్త్రంలో ఆనందం, తెలివితేటలు, గౌరవం, శ్రేయస్సుకు సూచికగా భావిస్తారు. దీని కారణంగా తులారాశి తోపాటు సింహ మరికొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ బుధాదిత్య రాజయోగం వల్ల ఈ రాశుల వారికి సుఖ సంతోషాలు కలగడమే కాకుండా జీవితంలో అష్టైశ్వర్యాలు లభిస్తాయని వారు అంటున్నారు. అయితే అక్టోబర్ మొదటివారం అత్యధిక లాభాలు పొందబోయే రాశులు వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


అక్టోబర్ మొదటివారం లక్కీ రాశి ఫలాలు: 
కర్కాటక రాశి: 

అక్టోబర్ మొదటివారం కర్కాటక రాశి వారికి జీవితంలో ఆనందం శ్రేయస్సు లభించడమే కాకుండా ఊహించని విజయాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వీరికి వ్యాపారాల్లో మెరుగుదల లభించడమే కాకుండా ఎప్పటినుంచో వస్తున్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా వీరు వ్యాపారాలు కూడా విస్తరిస్తారు. అలాగే కర్కాటక రాశి వారు కొత్త ప్రణాళికలతో ఏవైనా పనులు ప్రారంభించడం వల్ల అద్భుతమైన విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ప్రభుత్వ రంగాల్లో పనులు చేస్తున్న వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరు చేసే ప్రాజెక్టులన్ని పూర్తిగా సక్సెస్ అవుతాయి. ఇక కుటుంబ జీవితం కూడా ఎంతో శుభ్రంగా ఉంటుంది. 


సింహరాశి 
సింహరాశి వారికి కూడా ఈ అక్టోబర్ మొదటివారం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు పదవులు లభించడమే కాకుండా కొత్త బాధ్యతలు పొందుతారు. ముఖ్యంగా నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తులు ఊహించని ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా జీవితంలో ఈ వారం సానుకూలమైన ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు వ్యాపారాలు చేస్తున్న వారికి మార్కెట్లో మంచి రేంజ్ లభించి అకస్మాత్తుగా ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి. అలాగే భూములు భవనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటికే ప్రేమలో పడిన వ్యక్తులకు వివాహాలు కూడా జరిగే ఛాన్స్ ఉంది. ఇక మంచి పనులు చేసే వారికి ఈ సమయం ఎంతో శుభప్రదంగా..లాభదాయకంగా ఉంటుంది.


తులారాశి 
తులా రాశి వారికి కూడా ఈ వారం ఎంతో శుభప్రదంగా ఉంటుంది అంతేకాకుండా వీరికి పెండింగ్లో ఉన్న పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. ఇక ఉద్యోగులకు ఈ సమయం లోగా ఉండదు ఈ సమయంలో పదోన్నతులతో పాటు బదిలీలు కూడా జరుగుతాయి. ముఖ్యంగా చాలా కాలం పాటు ఎదురుచూస్తున్న డబ్బులు కూడా తిరిగి పొందుతారు. దీంతోపాటు గతంలో భూతగాదాలు కూడా ఈ వారంలో పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ సమయంలో గొప్ప అవకాశాలు కూడా లభించే ఛాన్స్ ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఉద్యోగాలు చేసేవారు సీనియర్స్ నుంచి మంచి సూచనలు పొంది పనులు అద్భుతంగా చేయగలుగుతారు. అలాగే పిల్లలనుంచి కూడా కొంతమంది గుడ్ న్యూస్ వింటారు. దీని కారణంగా కుటుంబ జీవితంలో మొత్తం ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది.


Also Read: Jupiter Good Effect: ఈ రాశులవారిపై బృహస్పతి ఎఫెక్ట్‌.. 3 రాశులవారికి గోల్డెన్‌ లైఫ్‌!


మీన రాశి 
మీన రాశి వారికి కూడా ఈ నెల మొదటి వారం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. దీని కారణంగా వీరు శుభవార్తలు అందుకుంటారు. అలాగే కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కూడా నెలకొంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న ఎలాంటి పనులైన సులభంగా పూర్తవుతాయి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య వస్తున్న పరస్పరమైన గొడవలు కూడా సులభంగా పరిష్కారం అవుతాయి. అంతేకాకుండా సమాజంలో గౌరవం లభించడమే కాకుండా కార్యాలయాల్లో ఆశించిన విజయాలు సాధిస్తారు దీని కారణంగా వీరికి అద్భుతమైన పేరు పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అలాగే వ్యాపారాలు చేస్తున్న మీన రాశి వారు అద్భుతమైన ఆర్థిక లాభాలు పొందగలుగుతారు. దీంతో పాటు వైవాహిక జీవితంలో వస్తున్న ఎలాంటి సమస్యలైనా పూర్తిగా తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ సమయంలో అదనపు ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి.


Also Read: Jupiter Good Effect: ఈ రాశులవారిపై బృహస్పతి ఎఫెక్ట్‌.. 3 రాశులవారికి గోల్డెన్‌ లైఫ్‌!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.