Lucky Zodiac Signs of December 2022: జ్యోతిషశాస్త్రంలో గ్రహ సంచారం, గ్రహాల కలయికతో శుభ యోగాలు, రాజయోగాలు ఏర్పడతాయి. ఈ శుభ యోగాలలో బుధాదిత్య రాజయోగం కూడా ఒకటని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ నెలలో సూర్యు, బుధ గ్రహాలు ధనుస్సు రాశిలోకి సంచారం చేయబోతున్నాయి. ఈ సంచారం డిసెంబర్ 3 జరుగుతుంది. కాబట్టి ఈ సంచారం ప్రభావం చాలా రాశులవారిపై పడే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఒకే రాశిలో సూర్యుడు-బుధుడు కలబోతున్నాడు. దీని వల్ల బుధాదిత్య యోగం ఏర్పడబోతోంది. ఈ యోగం వల్ల 3 రాశువారిపై మంచి ప్రయోజనాలు కలుగే అవకాశాలున్నాయి. ఈ రాశులవారు చాలా రకాల ప్రయోజనాలు పొందుతారని జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. ఈ యోగం వల్ల ఏయే రాశువారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధాదిత్య రాజయోగం వల్ల ఈ రాశుల వారి లాభాలే..లాభాలు:
మేషం:

బుధాదిత్య యోగం మేషరాశి వారికి ఈ క్రమంలో చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా మేష రాశి వారు ఏ పని చేసిన విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా లాభాలు పొందే అవకాశాలున్నాయి. ఈ సమయంలో ఉద్యోగస్తులకు పురోభివృద్ధి, గౌరవం పెరుగుతుంది. అంతేకాకుండా వ్యాపారాల్లో కూడా ఊహించని లాభాలు పొందుతారు. ఇక ఆర్థిక పరిస్థితుల విషయానికొస్తే భారీ మొత్తంలో లాభాలు పొందుతారు.


కుంభ రాశి:
బుధాదిత్య యోగం వల్ల కుంభ రాశి వారికి కూడా చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ రాశివారు ఆర్థిక పరమైన విషయాలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారు షేర్ మార్కెట్స్‌ పెట్టుబడులు పెడితే ఆదాయం కూడా రెప్పుంటు అవుతుంది. కెరీర్‌కు సంబంధించి కొన్ని శుభవార్తలు కూడా వింటారు.


మీన:
ఈ నెలలో ఏర్పడే బుధాదిత్య రాజయోగం వల్ల మీన రాశి వారు కూడా చాలా రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. మీన రాశి వారు ఈ యోగం వల్ల ఉద్యోగం, వ్యాపారాలలో లాభదాయకంగా ఉండే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో వీరికి బాధ్యతలు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తువారు ప్రమోషన్-ఇంక్రిమెంట్ పొందే ఛాన్స్‌ కూడా ఉంది.  ఈ క్రమంలో డబ్బు, కెరీర్ పరంగా మంచి ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


 


Also Read : Vijay Devarakonda ED : పాపులారిటీ ఉంటే ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి.. ఈడీ విచారణపై విజయ్ కౌంటర్లు


Also Read : Nara Brahmani Bike Riding : బాలయ్య కూతురా? మజాకా?.. బైక్ రైడర్‌గా నారా బ్రహ్మణి యాత్ర


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook