Lucky Zodiac Signs In 2025 In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు ఒక నిర్దిష్ట విరామం తర్వాత ఒక రాశి నుంచి మరో రాశి సంచారం చేస్తూ ఉంటాయి. మీన రాశి నుంచి మేష రాశి వరకు ఉన్న 12 గ్రహాలు రాశి సంచారం తప్పకుండా చేస్తాయి. దీని కారణంగా శుభ, అశుభ ప్రభావాలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ సంవత్సరంలోని జూన్ నెల ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ నెలలో దేవగురువు బృహస్పతి సంచారం చేయడమే, కాకుండా ఎంతో ప్రాముఖ్యత కలిగిన శని గ్రహం తిరోగమనం చేయబోతోంది. గత సంవత్సరంలోని జనవరి 17న శని గ్రహం కుంభరాశిలోకి సంచారం చేయగా, మే ఒకటో తేదీన బృహస్పతి గ్రహం సంచారం చేసింది. ఆ తర్వాత ఈ రెండు గ్రహాలు వచ్చే ఏడాది (2025)లో రాశి సంచారం చేస్తాయి.. దీంతో వచ్చే సంవత్సరంలో కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే శని, గృహస్పతి గ్రహాల సంచారాల కారణంగా ఏయే రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి:
2025 సంవత్సరంలో గురు శని గ్రహాల సంచారంతో మేష రాశి వారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి అద్భుతమైన ఫలితాలు లభించడమే, కాకుండా కోర్టు కేసుల నుంచి విముక్తి లభిస్తుంది. దీంతోపాటు ఆర్థిక పరిస్థితులు కూడా గతంలో కంటే కాస్త మెరుగుపడతాయి. అంతేకాకుండా కెరీర్ కు సంబంధించిన పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ సమయం లాభసాటిగా ఉండే అవకాశాలున్నాయి. అలాగే వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా ఎంతో సులభంగా పరిష్కారమవుతాయి. దీంతోపాటు ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా సులభంగా తొలగిపోతాయి. అలాగే వీరికి బలం విశ్వాసం కూడా సులభంగా పెరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.


మకర రాశి: 
మకర రాశి వారికి వచ్చే సంవత్సరం శని సంచారంతో ఏలినాటి శని నుంచి విముక్తి లభించబోతోంది. దీని కారణంగా ఈ రాశి వారికి ఎలాంటి పనిచేసిన సులభంగా విజయాలు లభించబోతున్నారు. అంతేకాకుండా కెరీర్‌కు సంబంధించిన విషయంలో కూడా మెరుగుదల కనిపిస్తుంది. అలాగే ఈ రాశి వారికి ధన ప్రవాహం కూడా పెరిగి, విపరీతంగా డబ్బు సంపాదిస్తారు. అంతేకాకుండా వీరికి వాస్తు సౌకర్యం కూడా లభిస్తుంది. అలాగే జీవితంలో ఆనందం శాంతి లభించడమే కాకుండా జీవితంలో ప్రశాంతత ప్రారంభమవుతుంది. దీంతోపాటు సమాజంలో ఎంతో గౌరవం లభించడమే కాకుండా మంచి పేరును పొందుతారు. అలాగే జీవితంలో ప్రతి రంగంలో విజయాలు సాధించేందుకు అదృష్టాన్ని సొంతం చేసుకుంటారు.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


మీనరాశి: 
మీన రాశి వారికి కూడా బృహస్పతి శని సంచారాల కారణంగా కాస్త విముక్తి లభిస్తుంది. రాశి వారు వచ్చే సంవత్సరం అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. అలాగే వీరి శత్రువులు కూడా ఘోరంగా ఓడిపోబోతున్నారు.. దీంతోపాటు ప్రేమ వ్యవహారాల్లో మాధుర్యం, సింగిల్స్‌కి పెళ్లిలు కూడా జరుగుతాయి. దీంతోపాటు వ్యాపారాలు చేస్తున్న వారికి కొత్త ఆధారంగా లభిస్తాయి. అలాగే రాజకీయ రంగంలో ఇప్పటినుంచి మంచి పరిజ్ఞానం ఉన్నవారికి అద్భుతమైన అవకాశాలు వస్తాయి. అంతేకాకుండా మతపరమైన పనుల పట్ల కూడా ఆసక్తి పెరుగుతుంది. దీంతో పాటు ఇంట్లో కొన్ని శుభకార్యాలు కూడా జరగవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో అదృష్టం లభిస్తుంది.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి