Lunar Eclipse 2022: చంద్రగ్రహణం రోజున ఈ 7 నియమాలు పాటిస్తే దుష్ప్రభావాలు దూరమవుతాయి...
Lunar Eclipse 2022: గ్రహణం సమయంలో కొన్ని దుష్ప్రభావాలు వెంటాడుతాయని చాలామంది విశ్వసిస్తారు. ఈ దుష్ప్రభావాల ప్రభావం మీపై పడకుండా ఉండాలంటే జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని నియమాలు సూచించబడ్డాయి.
Lunar Eclipse 2022: యాధృచ్చికంగా ఈసారి ఒకేరోజు చంద్రగ్రహణం, బుద్ధ పూర్ణిమ రాబోతున్నాయి. ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం మే 16న ఏర్పడుతుండగా... అదే రోజు బుద్ధ పూర్ణిమ రాబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆరోజు ఉదయం 7.02గం. నుంచి మధ్యాహ్నం 12.20 గం. మధ్య చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ చంద్రగ్రహణం భారత్‌లో కనిపించదు.
హిందువుల విశ్వాసం ప్రకారం.. చంద్రగ్రహణం రోజున ఎటువంటి శుభకార్యాలు పెట్టుకోరు. చంద్రగ్రహణం రోజున కొంత చెడు ప్రభావం కూడా వెంటాడుతుందని నమ్ముతారు. అయితే చెడు ప్రభావం వెంటాడకుండా ఉండేందుకు జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని పరిష్కార మార్గాలు సూచించబడ్డాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
ఈ 7 నియమాలు పాటిస్తే మీపై ఎటువంటి గ్రహణం దుష్ప్రభావాలు ఉండవు :
చంద్రగ్రహణం సమయంలో గురు మంత్రాన్ని జపిస్తే మంచిదని విశ్వసిస్తారు. గురు మంత్రం 'ఓం గ్రాన్ గ్రీన్ గ్రున్స్: గురవే నమః' ఈ మంత్రాన్ని జపించడం శుభ ఫలితాలను ఇస్తుంది.
చంద్రగ్రహణ సమయంలో మహామృత్యుంజయ మంత్రాన్ని కూడా జపించాలి. ఇలా చేయడం వల్ల వ్యాధులు దూరమవుతాయి.
చంద్రగ్రహణం సమయంలో తులసి ఆకును నోట్లో పెట్టుకోవాలని చెబుతారు. ఇలా చేయడం వల్ల గ్రహణ దుష్ఫలితాలు దూరమవుతాయి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణం ప్రారంభమయ్యే ముందు, తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి. గ్రహణం ముగిసిన తర్వాత దానధర్మాలు చేయాలి.
చంద్రగ్రహణం సమయంలో గాయత్రీ మంత్రాన్ని పఠించడం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. గాయత్రీ మంత్రాన్ని పఠించడం వల్ల మీరు చేపట్టిన పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి.
చంద్రగ్రహణం సమయంలో లక్ష్మీదేవిని ధ్యానించడం కూడా శుభకరమని చెబుతారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీపై తన అనుగ్రహాన్ని కురిపిస్తుంది.
శని అర్ధశతకాల ప్రభావం ఉన్నవారు గ్రహణ సమయంలో శని మంత్రాన్ని పఠించాలి. ఇలా చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది.
Also Read: Tomato Price Hike: సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న టమాటా ధర... కిలో రూ.80...
Also Read: Mgm Hospital: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం, చెట్టు కిందే చికిత్స పొందుతున్న రోగి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.