Lunar Eclipse Effect 2022: చంద్రగ్రహణం మే 16 (సోమవారం)న రాబోతోంది. ఆరోజు ఉదయం 8.59 గం. నుంచి ఉదయం 10.23 గం. వరకు చంద్రగ్రహణం ఉంటుంది. ఇది ఈ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం. అంతకుముందు, ఏప్రిల్ 30న ఏర్పడిన సూర్యగ్రహణం వైశాఖ మాసం అమావాస్య రోజున ఏర్పడగా... చంద్ర గ్రహణం వైశాఖ పూర్ణిమ రోజున ఏర్పడుతుండటం గమనార్హం. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ... మన దేశంలో కనిపించదు. కాబట్టి ఈ గ్రహణం సూతక కాలం భారత్‌పై ప్రభావం చూపించదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
వృశ్చిక రాశిలో చంద్రగ్రహణం :
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మే 16న చంద్రగ్రహణం వృశ్చిక రాశిలో ఏర్పడనుంది. చంద్ర గ్రహణం రోజున ఏర్పడే గ్రహాలు, రాశుల కలయిక 3 రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆ రాశులేంటో.. వారికి కలిగే శుభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చంద్రగ్రహణం ఈ 3 రాశుల వారికి కలిసొస్తుంది :
మేషం : చంద్రగ్రహణం మేషరాశి వారికి చాలా శుభాలను కలగజేస్తుంది. ముఖ్యంగా కెరీర్ పరంగా కలిసొస్తుంది. వ్యాపారం, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి స్పష్టమైన పురోగతి కనిపిస్తుంది. వారి పట్ల అందరిలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పెట్టుబడులకు కూడా ఇది అనుకూల సమయం.
సింహం : సింహ రాశి వారికి ఉద్యోగ రీత్యా మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో కీలక స్థానంలో ఉన్న వ్యక్తులు పై స్థాయికి ప్రమోషన్ పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సుఖ, సంతోషాలు వెల్లివిరుస్తాయి.
ధనుస్సు : చంద్రగ్రహణం ధనుస్సు రాశి వారిపై సానుకూల ప్రభావం చూపుతుంది. వారి పురోగతికి కొత్త అవకాశాలను ఏర్పరుస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారు విశేషంగా రాణిస్తారు. వ్యాపారస్తులకు పెద్ద ఆర్డర్స్ వస్తాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.
(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook