Lunar Eclipse 2023: హిందూమతంలో గ్రహణాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. వివిధ తిధుల్లో ఏర్పడే సూర్య, చంద్ర గ్రహణాల వల్ల కొన్ని రాశులకు ఊహించని ప్రయోజనాలు కలిగితే మరి కొన్ని రాశులకు తీరని నష్టాలు చేకూర్చనుంది. అక్టోబర్ 28న అంటే రేపు ఏర్పడనున్న చంద్ర గ్రహణం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అక్టోబర్ 28న రేపు ఈ ఏడాది చివరి చంద్ర గ్రహణం ఉంది. అక్టోబర్ 28 రాత్రి 11 గంటల 32 నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ 29 న 3 గంటల 36 నిమిషాల వరకూ ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్ర గ్రహణం ప్రభావం 4 రాశులపై ప్రతికూల ప్రభావం పడనుంది. ఈ ప్రతికూల ప్రభావం నుంచి తప్పించుకునేందుకు జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఇవి పాటించడం ద్వారా వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు. లేకపోతే తీవ్ర సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. 


మేష రాశి జాతకులకు చంద్ర గ్రహణం ప్రతికూల ప్రభావం కల్గిస్తుంది. ఆదాయంతో పోలిస్తే ఖర్చు ఎక్కువ కావడం వల్ల ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు సైతం చుట్టుముడతాయి. ఊహించని, అనుకోని ఖర్చులు అధికంగా ఉంటాయి. ఉద్యోగులు, వ్యాపారులకు ప్రతికూల పరిస్థితులు చవిచూడాల్సి వస్తుంది. మేష రాశి జాతకులు చంద్ర గ్రహణం ప్రతికూల ప్రభావం నుంచి తప్పించుకునేందుకు ఏదైనా చెట్టుకు నీరు పోయాలి.


తులా రాశి జాతకులకు చంద్ర గ్రహణం ప్రభావం అత్యంత దారుణంగా ఉంటుంది. జీవితంలో ఊహించని సమస్యలు ఎదురౌతాయి. అశుభ ప్రభావం తగ్గించేందుకు ఆపన్నులకు కడుపు నింపాలి. ముఖ్యంగా పాలు దానం చేయాలంటారు జ్యోతిష్య పండితులు. సోదర సోదరీమణుల మధ్య సంబంధాలు కూడా క్లిష్టంగా మారుతాయి. పిల్లల చదువులపై ప్రభావం పడవచ్చు. ఆర్ధికంగా ఇబ్బందులు ఎదురౌతాయి. 


వృశ్చిక రాశి జాతకులకు చంద్ర గ్రహణం ప్రభావంతో తీరని హాని కలగనుంది. ముఖ్యంగా ఆరోగ్యపరంగా పరిస్థితి వికటిస్తుంది. గ్రహణం సమయంలో బయటకు వస్తే ఏదైనా ప్రమాదం తలెత్తవచ్చు. మీ ప్రత్యర్ధులు మీపై దాడికి ప్రయత్నించే అవకాశముంటుంది. ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. ఉద్యోగులు, వ్యాపారులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. లేకపోతే సమస్యలు ఎదురౌతాయి. 


కర్కాటక రాశి జాతకులకు ఒకదానికవెంట మరొకటిగా కష్టాలు వెంటాడుతాయి. పవిచేసే చోట సిబ్బందితో వాదన ఉండవచ్చు. ఈ పరిస్థితిని తప్పించేందుకు ప్రయత్నించండి. జీతాలు పెరగకపోవడం, ప్రతికూల ప్రభావం వల్ల పనిపై ఆసక్తి తగ్గుతుంది. అటు వ్యాపారులకు నష్టాలు ఎదురౌతాయి. పెట్టుబడి పెట్టే ఆలోచన మానుకోవాలి. మీ వైఖరిలో కూడా మార్పు అవసరం. ప్రతి చిన్నదానికి స్పందించడం మానుకోవాలి. కెరీర్‌లో సమస్యలు ఎదురుకావచ్చు.


Also read: Diwali 2023: దీపావళి ఎప్పుడు..ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు..గోవర్ధన పూజ తేదీ, నరక చతుర్దశి ప్రత్యేక సమయం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook