Lunar Eclipse On Holi 2024 In Telugu: హిందూ సంప్రదాయం ప్రకారం ఫాల్గుణ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున కాముడు దహనం చేయడం ఆనవాయితిగా వస్తోంది. ఆ తర్వాతి రోజు భారతీయులు ఎంతో ఘనంగా హోలీ పండగను జరుపుకుంటారు. హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే పండగల్లో హోలీ పండగ ఒకటి. ముఖ్యంగా యువ ఈ పండగను ఎంతో ఆనందంగా, ఉత్సహంగా జరుపుకుంటారు. అలాగే ఉత్తర భారతీయులు ఈ పండగ రోజు వివిధ రకాల ఆహారాలు తయారు చేసుకుని తింటూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం హోలీ పండగ  మార్చి 25 తేదిన రాబోతోంది. అయితే ఇదే రోజు చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతోంది. ఈ గ్రహణం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉదయం 10:23 గంటలకు ప్రారంభమవుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మధ్యాహ్నం 3:2 గంటల వరకు కొనసాగుతుంది. అయితే ఈ గ్రహం భారత్‌ వ్యాప్తంగా కనిపించే అవకాశాలు లేవు. కాబట్టి ఈ గ్రహణం ముందు ఏర్పడే సూతక కాలం కూడా చెల్లబాటు కాదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సంవత్సరం హోలీ రోజుకుని ప్రత్యేక ప్రముఖ్యత ఉంది. ఎందుకంటే దాదాపు 100 సంవత్సరాల తర్వాత హోలీ పండగ రోజు చంద్ర గ్రహణం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏర్పడే చంద్ర గ్రహణం కారణంగా కొన్ని రాశులవారు విపరీతమైన లాభాలు పొందితే, మరకొన్ని రాశులవారు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ఈ సమయంలో ఏయే రాశులవారు మంచి ఫలితాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.  


కుంభ రాశి:
కుంభ రాశి వారికి ఈ ఏర్పడే చంద్రగ్రహణం కారణంగా హోలీ రోజు ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. ధన ప్రవాహం కూడా పెరిగే ఛాన్స్‌ ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కెరీర్‌కి సంబంధించిన విషయాల్లో అనేక లాభాలు పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నవారు విపరీతమైన లాభాలు పొందుతారు. వ్యాపారాలు చేసేవారు పెట్టుబడులు పెట్టడం కూడా చాలా శుభప్రదం.


తుల రాశి:
తుల రాశి వారికి ఈ ఏర్పడబోయే చంద్రగ్రహణం కారణంగా సామాజిక హోదా కూడా పెరుగుతుంది. అంతేకాకుండా కీర్తి ప్రతిష్ఠలు కూడా పెరిగే ఛాన్స్‌ కూడా ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడే ఛాన్స్‌ ఉంది. అలాగే పాత ఆస్తులు కూడా తిరిగి పొందుతారు. అలాగే ధన ప్రవాహం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో లాభాలు కూడా కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


మేష రాశి:
హోలీ పండగ రోజు ఏర్పడబోయే చంద్రగ్రహణం కారణంగా మేష రాశివారు ఊహించని ప్రయోజనాలు పొందుతారు. వీరు ఈ సమయంలో ఆకస్మిక లాభాలుతో పాటు ఆనందకరమైన జీవితాన్ని పొందే ఛాన్స్‌ ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు ఎప్పటి నుంచో పొందాలనుకుంటున్న పితృ ఆస్తులు కూడా అందుకుంటారని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే సంపద కూడా పెరుగుతుంది. అలాగే బాకీ ఉన్న ధనం కూడా తిరిగి వచ్చే ఛాన్స్‌ కూడా ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి