Chandra Grahan 2023: చంద్రగ్రహణం ఈ రాశులవారికి చాలా ప్రమాదకరం.. ఇందులో మీరున్నారా?
Lunar Eclipse 2023; వచ్చే నెల 05న చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం కొన్ని రాశులవారిపై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Chandra Grahan 2023 Bad Effect: ఖగోళ సంఘటనలలో చంద్రగ్రహణం ఒకటి. ఈ సంవత్సరం తొలి చంద్రగ్రహణం మే 05న ఏర్పడనుంది. భారత్‌లో ఈ చంద్రగ్రహణం కనిపించదని చెబుతున్నారు. అందుకే దాని సూతక్ కాలం కూడా చెల్లదు. అయితే దీని ప్రభావం మొత్తం 12 రాశుల వారి జీవితాలపై కనిపిస్తుంది. చంద్రగ్రహణం కొన్ని రాశులవారికి ప్రమాదకరం. గ్రహణ సమయంలో ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.
మేషరాశి
తొలి చంద్రగ్రహణం మేషరాశి వారిపై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఈ సమయంలో మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దీంతో మీ ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. మీరు చట్టపరమైన వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి.
వృషభం
గ్రహణ సమయంలో వృషభ రాశి వారి కష్టాలు తీరిపోతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో మీరు ఆరోగ్యంపై ప్రత్యే శ్రద్ధ తీసుకోవాలి. కుటుంబానికి దూరమయ్యే అవకాశం ఉంది. మెుత్తానికి ఈ సమయం మీకు చాలా కష్టంగా నడుస్తోంది.
Also Read: Chandra Grahan 2023: చంద్ర గ్రహణం రోజున ఈ పరిహారం చేస్తే.. ఉద్యోగ, వ్యాపారాలలో గొప్ప విజయం మీ సొంతం!
కర్కాటక రాశి
చంద్రగ్రహణం కర్కాటక రాశి వారిపై చెడు ప్రభావం చూపుతుంది. మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఎన్నో అడ్డంకులు వస్తాయి. గ్రహణ సమయంలో శివుడిని ఆరాధించడం వల్ల మేలు జరుగుతుంది.
సింహరాశి
చంద్రగ్రహణం సింహరాశి వారికి అశుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీరు చెడు వార్తలు వినే అవకాశం ఉంది. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించండి, లేకపోతే మీరు నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి.
Also Read: Jupiter rise 2023: మరో 48 గంటల్లో ఈ రాశుల అదృష్టం మారబోతుంది.. మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.