Jupiter rise 2023: మరో 48 గంటల్లో ఈ రాశుల అదృష్టం మారబోతుంది.. మీ రాశి ఉందా?

Jupiter rise 2023: ఈ నెల 27న బృహస్పతి మేషరాశిలో ఉదయించబోతున్నాడు. పైగా అదే రోజు పుష్య నక్షత్రం కూడా ఉంటుంది. బృహస్పతి ఉదయించడం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 25, 2023, 05:34 PM IST
Jupiter rise 2023: మరో 48 గంటల్లో ఈ రాశుల అదృష్టం మారబోతుంది.. మీ రాశి ఉందా?

Guru Uday effect: 12 సంవత్సరాల తర్వాత గురుడు మేషరాశిలో సంచరిస్తున్నాడు. ఏప్రిల్ 27న బృహస్పతి మేషరాశిలో ఉదయించబోతున్నాడు. ఏప్రిల్ 27న గురు పుష్య నక్షత్రం ఉంటుంది. గురు పుష్య నక్షత్రంలో బృహస్పతి ఉదయించడం చాలా అరుదుగా జరుగుతుంది. గురుడు రైజింగ్ వల్ల ఏయే రాశులవారు ప్రయోజం పొందనున్నారో తెలుసుకుందాం. 

కర్కాటకం: బృహస్పతి ఉదయం కర్కాటక రాశి వారికి చాలా మేలు చేస్తుంది. మీ కెరీర్‌లో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. మీ పని పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీకు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. మీరు మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. 
ధనుస్సు : బృహస్పతి ఉదయించడం వల్ల ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. మీకు మంచి రోజులు ప్రారంభంకానున్నాయి. మీ డబ్బు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. మీ పని పట్ల మీ బాస్ సంతృప్తి చెందుతారు. లవ్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. 
మీనం: గురు ఉదయ మీన రాశి వారికి కొత్త ఉద్యోగావకాశాలు ఇస్తుంది. పూర్వీకుల ఆస్తి ద్వారా ప్రయోజనం పొందుతారు. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. మెుత్తానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 

Also Read: Guru Gochar 2023: గజలక్ష్మీ రాజయోగంతో ఈ 4 రాశులకు తిరుగులేనంత ధనం.. ఇందులో మీరున్నారా?

మేషం: ఇదే రాశిలో గురుడు ఉదయించబోతున్నాడు, కాబట్టి మేషరాశి వారు శుభఫలితాలను పొందుతారు. మీరు కెరీర్ లో మంచి పురోగతిని సాధిస్తారు. మీకు కొత్త జాబ్ లభిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. పెద్ద మెుత్తంలో ధనలాభం ఉంటుంది. 
మిథునం: పుష్య నక్షత్రంలో గురుడు ఉదయించడం వల్ల మిథునరాశి వారికి ధనలాభం కలుగుతుంది. మీకు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీరు పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందుతారు. 

Also Read:  Jupiter Rahu Conjunction: 36 ఏళ్ల తర్వాత మేషరాశిలో అరుదైన కలయిక.. ఈ రాశులపై డబ్బు వర్షమే ఇక..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News